‘ఛలో’ అంటున్న యంగ్‌ హీరో | Naga Shourya Next Movie title Chalo | Sakshi
Sakshi News home page

‘ఛలో’ అంటున్న యంగ్‌ హీరో

Published Sat, Oct 28 2017 4:11 PM | Last Updated on Sat, Aug 3 2019 12:30 PM

Naga Shourya Next Movie title Chalo - Sakshi

మంచి విజయాలతో కెరీర్‌ ప్రారంభించిన యంగ్‌ హీరో నాగశౌర్య తరువాత ఆ ఫాం కొనసాగించలేకపోయాడు. లవర్‌ భాయ్‌ ఇమేజ్‌కు చేరువవుతున్న తరుణంలో వరుస ఫ్లాప్‌ లు ఎదురై కష్టాల్లో పడ్డాడు. సోలో హీరోగా ఆకట్టుకోలేకపోయిన నాగశౌర్య జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి లాంటి సినిమా లతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా మరోసారి సోలో హీరోగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు నాగశౌర్య.

కొత్త దర్శకుడు వెంకీ డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ఛలో అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను నాగశౌర్య అమ్మా నాన్నలే నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగు తమిళ భాషల్లో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న కణం సినిమాలోనూ నటిస్తున్నాడు నాగశౌర్య. ఈ సినిమాలో టాలెంటెడ్‌ హీరోయిన్‌ సాయి పల్లవి, నాగశౌర్యకు జోడిగా నటిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement