విక్రమ్ కె.కుమార్, అఖిల్, అనూప్ రూబెన్స్, నాగార్జున
‘‘తెలుగు ప్రేక్షకులకు, అభిమాన దేవుళ్లందరికీ హలో. అఖిల్‌తో సినిమా తీస్తానంటూ గత ఏడాది మీకు ప్రామిస్ చేశా. నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ తీశా. వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం అన్నాం.. కొట్టాం. ఆ చిత్రం తర్వాత అఖిల్ ‘హలో’ సినిమా పనిమీదే ఉన్నా’’ అని హీరో అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్, కల్యాణీ ప్రియదర్శన్ జంటగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ‘హలో’ ఈనెల 22న విడుదలవుతోంది. అనూప్ రూబెన్స్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాకు ఇష్టమైన, మనసుకి దగ్గరైన డైరెక్టర్ విక్రమ్.
తెలుగు ప్రేక్షకుల్లో ఒక లెజెండ్‌గా నిలిచిపోయిన మా నాన్నగారి(అక్కినేని నాగేశ్వరరావు) ఆఖరి సినిమా ఎలా తీయాలనుకుంటుంటే దేవుడిలా వచ్చిన విక్రమ్ ‘మనం’ వంటి సినిమా తీసి నాన్నగారిని ఎంత గొప్పగా సాగనంపాడో. అఖిల్‌ని రీ లాంచ్‌లో నేను ఎలాగైతే చూడాలనుకున్నానో విక్రమ్‌తో చెప్పా. తను ‘హలో’ తో అలాగే రీలాంచ్ చేశాడు. ఈ మధ్య నా పాత సినిమాలు కొన్ని చూశా. ‘హలో’ సినిమాలో వీణ్ణి(అఖిల్) చూస్తుంటే నాకు అర్థం కావడం లేదు. మేం ఏం చేశాం.. ఇప్పుడు ఈ సినిమాలో వీడేం చేస్తున్నాడని. తెలుగు చిత్ర పరిశ్రమకు డ్యాన్సు, గ్రేసు నేర్పింది నాన్నగారు. ఆయన అచ్చు గుద్దినట్టు వీడిలో కనిపిస్తున్నారు నాకు. వైజాగ్‌కి రావాలని గంటా శ్రీనివాసరావుగారు అడుగుతున్నారు. వైజాగ్‌కి మేం ఎప్పుడో వచ్చాం. నా తొలి సినిమా ‘విక్రమ్’, ‘మాస్’ ఇక్కడే తీశాం. అరకులో ఎన్ని సినిమాలు తీశాను. వైజాగ్ అంటే మాకు ప్రాణం. ఇక్కడి కొస్తాం షూటింగ్ చేస్తాం.
చైతూ(నాగచైతన్య)తో మరో సినిమా చేయమని విక్రమ్‌ని అడిగా. తను ఒప్పుకున్నాడు. మూడు రోజుల కిత్రం ‘హలో’ పూర్తి సినిమా హాయిగా చూశా. ‘వస్తున్నాం.. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం.. ఇది ఫిక్స్.. ఓకే’ అన్నారు. ‘‘ఏడాదిగా ఎమోషనల్ జర్నీ చేస్తున్నా. ఇంత కాన్ఫిడెంట్‌గా నేను ఇక్కడ మాట్లాడటానికి కారణం అమ్మ. నాన్న. వారు నా లైఫ్‌లో లేకపోతే ఏమైపోయేవాడినో. వారికి థ్యాంక్స్ మాత్రమే చెప్పగలను. విక్రమ్‌ని కలిసినప్పుడు నాలో ఎనర్జీ, కాన్ఫిడెన్స్ లెవల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ‘హలో’ తో పెరిగాయి. నేను హిట్ కొట్టడానికి రెడీ. మీరు(ఫ్యాన్స్) రెడీయా.. హిట్ కొడుతున్నాం’’ అన్నారు అఖిల్. ‘‘నాగార్జునసార్ ప్రొడక్షన్‌లో విక్రమ్‌సార్ డైరెక్షన్‌లో చేయడం ఆనందంగా ఉంది. అఖిల్ నైస్ కో స్టార్’’ అన్నారు కల్యాణీ ప్రియదర్శన్. తెలుగు సాహితీ అకాడమీ అవార్డు గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, విక్రమ్ కె.కుమార్, అనూప్ రూబెన్స్, అక్కినేని అమల, దర్శకుడు ప్రియదర్శన్, నటుడు అలీ, పాటల రచయితలు చంద్రబోస్, అలేఖ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment