‘‘నేను కూడా కొన్ని రోజులు ప్రొడక్షన్ ఆపేసి నటనపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నా. మంచి కథలు వస్తే హీరోగా చేస్తా. ఎవరైనా మంచి కథతో వస్తే నేను, చైతు, అఖిల్ చేయడానికి కూడా సిద్ధమే’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో’. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ నెల 10న వైజాగ్‌లో ఆడియో వేడుక నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.
► చిన్న వయసులో తప్పిపోయిన సోల్‌మేట్ కోసం వెతికే అవినాష్ పాత్రలో అఖిల్ కనపడతాడు. ‘హలో’ సినిమా చూడగానే బాలీవుడ్ ‘యాదోం కీ బారాత్’ సినిమా గుర్తుకొచ్చింది.
► ‘మనం’ వంటి క్లిష్టమైన కథను విక్రమ్ ఎంతో సింపుల్‌గా తీసి, చూపించాడు. ‘హలో’ బ్యూటీఫుల్ రొమాంటిక్ స్టోరీ. యాక్షన్‌తో మిళితమై ఉంటుంది. విక్రమ్ సినిమాల్లో మ్యాజిక్ ఈ సినిమాలోనూ ఉంటుంది. ఓ మ్యాజిక్ మనుషులను ఎలా విడదీస్తుంది? ఎలా కలుపుతుందనేదే కథ. సినిమా చూశా. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.
► మంచి సినిమా కోసం అఖిల్ రెండేళ్లుగా వెయిట్ చేసి, చేసిన సినిమా ఇది. సినిమా చూస్తే అఖిల్ కష్టం అర్థమవుతుంది. ‘హలో’ ట్రైలర్ 8 మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. ఆడియో వేడుకలో అఖిల్ స్టేజ్‌పై పాట పాడటంతో పాటు డ్యాన్స్ చేస్తాడు. వైజాగ్‌లో తుఫాన్ సూచనలున్నాయంటున్నారు. కానీ, దేవుడు మాతో ఉన్నాడనుకుంటున్నాం.
► నాతో, అమలతో ‘నిర్ణయం’ సినిమా తీసిన డైరెక్టర్ ప్రియదర్శన్‌గారి అమ్మాయి కల్యాణి ఈ సినిమాలో హీరోయిన్. కల్యాణిగారి మదర్ లిజిగారిని నా సినిమా ద్వారా పరిచయం చేయాలనుకున్నా.. కుదరలేదు. కానీ, ఇప్పుడు ఆమె కూతురు కల్యాణిని అఖిల్ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం.
► హాలీవుడ్ ఫైట్‌మాస్టర్ బాబ్ బ్రౌన్‌తో 30 రోజులు యాక్షన్ పార్ట్ చేశాం. తెలుగు తెరపై ఇలాంటి యాక్షన్‌ను చూసి ఉండరు. అక్కడక్కడా జాకీచాన్ యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి.
► ఈ నెల 15, 16, 17 తేదీల్లో అఖిల్ అమెరికా వెళ్లి ఫ్యాన్స్‌ను కలుస్తాడు. తను 18న ఇక్కడికి రాగానే ప్రీ–రిలీజ్ వేడుక ఉంటుంది.
► నేను నిర్మించిన లేదా నటించిన సినిమా విడుదలవుతుందంటే నాకు పరీక్షలాగానే ఉంటుంది. రాత్రిళ్లు నిద్ర పట్టదు. ‘హలో’ సినిమాకు నేను వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చా.
► హ్యాపీగా లేకపోతే ‘హలో’ రిలీజ్ చేసేవాణ్ణి కాదు. ‘హలో’ తర్వాత విక్రమ్ బయటి సంస్థలో మరో సినిమా చేస్తాడు. ఆ తర్వాత చైతన్యతో సినిమా ఉంటుంది. వర్మ సినిమా బాగా వస్తోంది.
కొన్ని రోజులు ఓన్లీ యాక్షన్
Published Thu, Dec 7 2017 12:54 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment