hallow
-
స్వేదం చిందించనిదే సంపద దక్కుతుందా?
కుశాల్ చంద్ బాబా భక్తుడు. తెల్లవారింది మొదలు పొద్దుపోయే వరకు షిడ్డీలోని మసీదే అతని ఆవాసం. ఏ పనీ చేయకుండా మసీదులోనే గడిపేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పంచే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. చాలాకాలం పాటు బాబా అతని వాలకాన్ని గమనించారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఒకరోజు కుశాల్‌చంద్‌ని దగ్గరకు పిలిచి, ‘‘నీకు పొలం ఉంది కదా! అందులో పంటలు పండించడం లేదా?’’ అని అడిగారు. ‘‘లేదు బాబా! అది మొత్తం బీడు పడింది. పంటలు పండవు’’ కుశాల్ చంద్ చెప్పాడు. ‘‘భలేవాడివే! నీ పొలంలో లంకెబిందెలు ఉన్నాయయ్యా! వెంటనే పొలాన్ని మొత్తం దున్ను’’ అని బాబా అతనికి చెప్పారు. కుశాల్ చంద్ పొలం మొత్తం దున్ని లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. బాబా ఆశ్చర్యం నటిస్తూ ‘‘దొరకలేదా? ఇంతకీ పొలాన్ని ఎటునుంచి దున్నావ్’’ అని అడిగారు. కుశాల్‌చంద్ నిలువుగా దున్నానని చెప్పగానే, ‘‘ఈసారి అడ్డంగా దున్ని చూడు. తప్పకుండా దొరుకుతాయి’’ అని బాబా చెప్పారు. కుశాల్‌చంద్ అలా కూడా చేసి లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. ‘‘సరే, దొరక్కపోతే ఏం చేస్తాం! ఎలాగూ పొలాన్ని మొత్తం దున్నావు కాబట్టి అందులో మిరప విత్తనాలు చల్లు’’ అని సూచించారు బాబా. కుశాల్‌చంద్ అలాగే చేశాడు. బాబా సలహా సూచనలతో పంటను పెంచి పోషించాడు. ఆ ఏడాది సమీపంలో ఎక్కడా మిరప పంటన్నదే లేదు. కుశాల్‌చంద్ ఒక్కడే పండించాడు. దీంతో అతని పంటకు విపరీతమైన గిరాకీ ఏర్పడి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. కుశాల్‌చంద్ తనకొచ్చిన సొమ్మును రెండు మూటలుగా కట్టి బాబా ముందుంచాడు. సుఖం, కోరికలు, సంపద, కీర్తిప్రతిష్ఠలు ఏవైనా సరే ఆయాచితంగా లభించవు. దేనినైనా ప్రయత్నంతోనే సాధించుకోవాలి. స్వేదం చిందించనిదే సంపద దక్కదు. సాధన చేయనిదే ఏదీ సాధ్యం కాదు. భక్తి మంచిదే కానీ దాని పేరుతో పని మానుకోవడం మహా చెడ్డం. పనిపాటలు చేసుకుంటూనే భగవంతుని నామాన్ని నిత్యం స్మరించుకో. ఇక నువ్వు చేసే పనికి తిరుగుండదు. నీ పనికీ ఆటంకం ఉండదు’’అని బోధించారు విపులంగా. డా. కుమార్ అన్నవరపు -
కొన్ని రోజులు ఓన్లీ యాక్షన్
‘‘నేను కూడా కొన్ని రోజులు ప్రొడక్షన్ ఆపేసి నటనపైనే దృష్టి పెట్టాలనుకుంటున్నా. మంచి కథలు వస్తే హీరోగా చేస్తా. ఎవరైనా మంచి కథతో వస్తే నేను, చైతు, అఖిల్ చేయడానికి కూడా సిద్ధమే’’ అని అక్కినేని నాగార్జున అన్నారు. అఖిల్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో’. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ నెల 10న వైజాగ్‌లో ఆడియో వేడుక నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ► చిన్న వయసులో తప్పిపోయిన సోల్‌మేట్ కోసం వెతికే అవినాష్ పాత్రలో అఖిల్ కనపడతాడు. ‘హలో’ సినిమా చూడగానే బాలీవుడ్ ‘యాదోం కీ బారాత్’ సినిమా గుర్తుకొచ్చింది. ► ‘మనం’ వంటి క్లిష్టమైన కథను విక్రమ్ ఎంతో సింపుల్‌గా తీసి, చూపించాడు. ‘హలో’ బ్యూటీఫుల్ రొమాంటిక్ స్టోరీ. యాక్షన్‌తో మిళితమై ఉంటుంది. విక్రమ్ సినిమాల్లో మ్యాజిక్ ఈ సినిమాలోనూ ఉంటుంది. ఓ మ్యాజిక్ మనుషులను ఎలా విడదీస్తుంది? ఎలా కలుపుతుందనేదే కథ. సినిమా చూశా. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ► మంచి సినిమా కోసం అఖిల్ రెండేళ్లుగా వెయిట్ చేసి, చేసిన సినిమా ఇది. సినిమా చూస్తే అఖిల్ కష్టం అర్థమవుతుంది. ‘హలో’ ట్రైలర్ 8 మిలియన్ వ్యూస్ రాబట్టుకుంది. ఆడియో వేడుకలో అఖిల్ స్టేజ్‌పై పాట పాడటంతో పాటు డ్యాన్స్ చేస్తాడు. వైజాగ్‌లో తుఫాన్ సూచనలున్నాయంటున్నారు. కానీ, దేవుడు మాతో ఉన్నాడనుకుంటున్నాం. ► నాతో, అమలతో ‘నిర్ణయం’ సినిమా తీసిన డైరెక్టర్ ప్రియదర్శన్‌గారి అమ్మాయి కల్యాణి ఈ సినిమాలో హీరోయిన్. కల్యాణిగారి మదర్ లిజిగారిని నా సినిమా ద్వారా పరిచయం చేయాలనుకున్నా.. కుదరలేదు. కానీ, ఇప్పుడు ఆమె కూతురు కల్యాణిని అఖిల్ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. ► హాలీవుడ్ ఫైట్‌మాస్టర్ బాబ్ బ్రౌన్‌తో 30 రోజులు యాక్షన్ పార్ట్ చేశాం. తెలుగు తెరపై ఇలాంటి యాక్షన్‌ను చూసి ఉండరు. అక్కడక్కడా జాకీచాన్ యాక్షన్ సీన్స్ గుర్తుకొస్తాయి. ► ఈ నెల 15, 16, 17 తేదీల్లో అఖిల్ అమెరికా వెళ్లి ఫ్యాన్స్‌ను కలుస్తాడు. తను 18న ఇక్కడికి రాగానే ప్రీ–రిలీజ్ వేడుక ఉంటుంది. ► నేను నిర్మించిన లేదా నటించిన సినిమా విడుదలవుతుందంటే నాకు పరీక్షలాగానే ఉంటుంది. రాత్రిళ్లు నిద్ర పట్టదు. ‘హలో’ సినిమాకు నేను వాయిస్ ఓవర్ మాత్రమే ఇచ్చా. ► హ్యాపీగా లేకపోతే ‘హలో’ రిలీజ్ చేసేవాణ్ణి కాదు. ‘హలో’ తర్వాత విక్రమ్ బయటి సంస్థలో మరో సినిమా చేస్తాడు. ఆ తర్వాత చైతన్యతో సినిమా ఉంటుంది. వర్మ సినిమా బాగా వస్తోంది. -
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం
ద్వారకా తిరుమల :శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఒక భక్తుడు బుధవారం రూ.1,00,116 విరాళంగా అందించారు. విజయవాడకు చెందిన గర్రే రాఘవగుప్తా ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన భవనంలో ఈ విరాళాన్ని జమచేశారు. దాతకు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు విరాళం బాండ్‌ను అందజేసి, అభినందించారు.