లుక్‌... లుక్‌... అఖిల్‌ లవ్‌ కిక్‌! | Love Kick Stile Leak in the film as Akhil Hero | Sakshi
Sakshi News home page

లుక్‌... లుక్‌... అఖిల్‌ లవ్‌ కిక్‌!

Published Sat, Aug 19 2017 12:30 AM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

లుక్‌... లుక్‌... అఖిల్‌ లవ్‌ కిక్‌! - Sakshi

లుక్‌... లుక్‌... అఖిల్‌ లవ్‌ కిక్‌!

రోడ్డుపై రభస మొదలైంది! ఒకపక్క కార్లు తగలబడుతున్నాయ్‌. మరోపక్క ప్రాణాలు అరచేత పట్టుకుని కొందరు పరుగులు పెడుతున్నారు. ఇంకొందరు ఓ కుర్రాణ్ణి కుమ్మేయడానికి రెడీ అయ్యారు. అతడికి ఓ అమ్మాయి ముద్దు పెడుతోంది కదా... మిగతా లోకాన్ని మర్చిపోయుంటాడనుకున్నారు. కానీ, ముద్దుకి మురిసిపోతూనే ఆ కుర్రాడు కాలితో గట్టిగా ఓ కిక్‌ ఇచ్చాడు. ఓ పక్క కిస్‌... ఇంకోపక్క కిక్‌... స్టిల్‌ అదిరింది కదూ! కిస్‌ పెట్టించుకుంటూ కిక్‌ ఇచ్చిన ఆ కుర్రాడు అఖిల్‌.

ఈ స్టిల్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అతను హీరోగా నటిస్తున్న సిన్మాలోనిది. శుక్రవారం మధ్యాహ్నమే ఈ స్టిల్‌ లీక్‌ కావడంతో రాత్రి అఖిల్‌ ట్వీట్‌ చేశారు. ఈనెల 21న మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ స్టిల్‌లోని అమ్మాయి హీరోయిన్‌ కల్యాణీ ప్రియదర్శన్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్‌ ప్రకటిస్తారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement