Vikram K. Kumar
-
జర్నలిస్ట్‌గా నాగ చైతన్య.. వరుస హత్యలను ఎలా ఛేదించాడు
అక్కినేని నాగచైతన్య నటించిన తొలి వెబ్ సిరీస్ 'దూత' డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. నేడు (నవంబర్ 23) చైతూ పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నాగచైతన్యతో 'మనం', 'థాంక్యూ' సినిమాలను డైరెక్ట్ చేసిన విక్రమ్ కె. కుమార్ తాజాగా దూత అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులో పార్వతీ తిరువోతు, ప్రియ భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలన ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. దూతలో నాగ చైతన్య జర్నలిస్ట్‌గా కనిపిస్తాడు. సమాచార్ అనే దినపత్రికలో సాగర్ అనే జర్నలిస్టుగా చైతూ నటించాడు. ఈ క్రమంలో నగరంలో జరిగే వరుస హత్యలకు న్యూస్ పేపర్లో వచ్చే కార్టూన్లకు సంబంధం ఉన్నట్లు ఆయన కనుగొంటాడు. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు జర్నలిస్ట్‌గా చైతన్య చేసిన సాహాసాలు ఎలాంటివి..? ఈ క్రమంలో అతని మీదే నేరం ఎందుకు పడుతుంది..? చిక్కుల్లో పడిన ఒక జర్నలిస్ట్ ఎలా బయటపడ్డాడు అనేది తెలియాలంటే డిసెంబర్ 1న అమెజాన్‌లో చూడాల్సిందే. -
వాళ్లందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను
‘‘రచయిత బీవీఎస్ రవి నాలుగేళ్ల క్రితం నాకు ‘థ్యాంక్యూ’ స్టోరీ లైన్ చెప్పినప్పుడు ఎగ్జయిట్ అయ్యాను. ఇదే లైన్‌ని నాని ‘గ్యాంగ్ లీడర్’ ప్రీమియర్‌లో విక్రమ్ కుమార్‌కి చెబితే తను కూడా ఎగ్జయిట్ అయ్యి, సినిమా చేద్దాం అన్నాడు. ‘మనం’ చిత్రం తర్వాత విక్రమ్‌కి, చైతన్యకి మధ్య ఉన్న కెమిస్ట్రీ (డైరెక్టర్, హీరోగా) మా సినిమాకి ప్లస్ అయింది. ‘థ్యాంక్యూ’లో మూడు పాత్రల్లో నాగచైతన్య అద్భుతంగా నటించాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. అనిత సమర్పణలో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదలకానుంది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు విలేకరులతో పంచుకున్న విశేషాలు. ► బీవీఎస్ రవి చెప్పిన స్టోరీ లైన్‌తో ఓ హీరో కేరక్టర్ రాయాలనుకున్నాం. ఆ పాత్రకి గతం చెప్పాలనుకున్నాం. అందుకే ‘థ్యాంక్యూ’లో హీరో పాత్రలో కాలేజ్, టీనేజ్.. ఇలా అన్నింటినీ డిజైన్ చేశాం. స్క్రీన్‌ప్లే, సీన్స్ అన్నీ విక్రమ్ స్టైల్లో రాయమని రవికి చెబితే అలాగే రాశాడు. ∙ ► కరోనా లాక్డౌన్ సమయంలో నేను కూడా వ్యక్తిగతంగా ‘థ్యాంక్యూ’ జర్నీని స్టార్ట్ చేశాను. నాకు స్కూల్లో, ఆటోమొబైల్ రంగంలో సహాయం చేసిన వారందర్నీ కలిసి థ్యాంక్స్ చెప్పాను. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో థ్యాంక్యూ జర్నీని కంటిన్యూ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. ∙ ► ‘థ్యాంక్యూ’ సినిమాలో ఒక సాధారణ కుర్రాడు లెజెండ్ అవుతాడు. మొత్తం నేనే అనుకుంటాడు. కానీ అది నిజం కాదు. అతనికి సాయం చేసినవాళ్లు చాలామంది ఉంటారు. అందమైన ప్రేమకథ, వాణిజ్య అంశాలన్నీ కలిపి ఈ కాన్సెప్ట్‌ని సినిమాటిక్‌గా చెప్పడానికి ఎక్కువ స్ట్రగుల్ అయ్యాం. గతం గురించి ఆలోచించే టైమ్ ప్రస్తుతం ఎవరికీ లేదు. ► కథ విషయంలో ప్రతి డైరెక్టర్‌తో డిస్కస్ చేస్తాను. నా సలహాలను కొందరు డైరెక్టర్లు వింటారు.. మరికొందరు తామే రైట్ అంటారు. అలాంటివాళ్లతో నేను వాదించను. ∙పెద్ద డైరెక్టర్ల అనుభవాలు వాడుకుంటాను. కొత్తవాళ్లకి పాయింట్ టు పాయింట్ రాసిస్తాను. దానికి రీచ్ అవుతున్నామా? లేదా అని చెక్ చేస్తాను. మిడ్ వాళ్లతో అటూ ఇటూ ఉంటాను. ► కరోనాకి ముందు, కరోనా తర్వాత ప్రేక్షకుల ఆలోచనలు మారిపోయాయి. అంతకుముందు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూద్దామనే మూడ్‌లో ఉన్నారు. లాక్డౌన్లో ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో చాలా కంటెంట్ చూసి, ఎడ్యుకేట్ అయ్యారు. ఇప్పుడు వాళ్లకి అంతంత మాత్రం కంటెంట్ నచ్చట్లేదు. దీనికోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా? అనుకుంటున్నారు. ఈ విషయంలో చిత్ర పరిశ్రమ మారాల్సిన టైమ్ వచ్చింది. మంచి కంటెంట్ ఇచ్చి టిక్కెట్ ధరలు తగ్గిస్తే జనాలు వస్తారు. ఓటీటీలో త్వరగా సినిమాలు రావడం వల్ల కూడా థియేటర్లకు వచ్చే జనాలు తగ్గారు. మీడియం రేంజ్ నుంచి టాప్ స్టార్స్ సినిమాలు థియేటర్లలో వచ్చాకే ఓటీటీకి వెళ్లాలి. అది ఎన్ని వారాలకు? అనేది నిర్మాతలందరూ కలిసి మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య వచ్చిన ‘మేజర్, విక్రమ్’ సినిమాల కంటెంట్ బాగుండటంతో ప్రేక్షకులు ఆదరించారు... మంచి కంటెంట్ ఉంటే హిట్ చేస్తారు. ► ఒక సినిమా ఫ్లాప్‌కు చాలా కారణాలుంటాయి. కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ఇబ్బందులవల్ల జనాల్లో డబ్బు ఖర్చు చేసే సత్తా కూడా తగ్గింది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించడం అనేది గతంలో నిర్మాత సమస్య. కానీ ఇప్పుడు సినిమాది. అందుకే అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. ఈ విషయం డైరెక్టర్లకీ, హీరోలకి కూడా అర్థమైంది. హిందీలో తీసిన ‘హిట్’ సినిమాకి మేం నష్టపోలేదు. కానీ, ‘జెర్సీ’ రీమేక్‌ని కరోనా పరిస్థితుల్లో రిలీజ్ చేయడం వల్ల 3–4 కోట్ల డ్యామేజ్‌తో బయటపడ్డాం. ఓటీటీల వల్ల నిర్మాతలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్‌హిట్ అయినా వచ్చేదేమీ లేదు. అదే సినిమా థియేటర్లలో రిలీజ్ అయితే ఆ వసూళ్లు, ఆ ఎనర్జీ వేరు. ప్యాషన్‌గా సినిమా తీయాలనుకున్నవారికి డబ్బులతో పాటు ఎనర్జీ కూడా ముఖ్యమే. హీరోలందరికీ ప్రస్తుత పరిస్థితు (నిర్మాణ వ్యయాన్ని ఉద్దేశించి) లను, సమస్యను చెబితే అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. -
చిన్న చిన్న విషయాలకు కూడా ‘థ్యాంక్యూ’ చెబుతున్నారు: డైరెక్టర్
‘‘మన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో మందికి థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. ఎలాంటి అహం లేకుండా మనం థ్యాంక్స్ చెబితే ఎదుటివారు పడే ఆనందం మన మనసుకు సంతృప్తినిస్తుంది. ‘థ్యాంక్యూ’ సినిమా చాలామంది కథ. అందరికీ కనెక్ట్ అవుతుంది’’ అని డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ అన్నారు. అక్కినేని నాగచైతన్య హీరోగా, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు విక్రమ్ కె. కుమార్ విలేకరులతో చెప్పిన విశేషాలు. ► ‘మనం’ తర్వాత నేను, చైతు మరో సినిమా చేద్దామని నాలుగేళ్లుగా అనుకుంటున్నాం. ఆ సమయంలో బీవీఎస్ రవిగారు రాసిన ‘థ్యాంక్యూ’ కథ వచ్చింది. ఆ కథ వినగానే కనెక్ట్ అయ్యాను. ఇప్పటివరకూ నేను దర్శకత్వం వహించిన చిత్రాలన్నింటికీ నేనే కథలు రాశాను. తొలిసారి ఓ రచయిత కథకి దర్శకత్వం వహించాను. ఈ చిత్రం సోల్, హార్ట్ రవిదే.. కానీ ట్రీట్మెంట్ నాది. ► ‘థ్యాంక్యూ’ అనేది పవర్ఫుల్ పదం. దాని విలువ చాలామందికి తెలియడం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెబుతున్నారు. థ్యాంక్స్ విలువని మా సినిమాలో చెప్పాం. జీవితంలో ప్రతి ఒక్కరూ తల్లితండ్రులకు థ్యాంక్స్ చెప్పాలి. నేను మా నాన్నకి థ్యాంక్స్ చెప్పకుండానే ఆయన వెళ్లిపోయారు. ► ఈ చిత్రంలో అభిరామ్ పాత్రలో నాగచైతన్య మూడు వేరియేషన్స్‌లో కనిపిస్తాడు. ఒక్కో వేరియేషన్‌కి ఒక్కో హీరోయిన్ ఉంటుంది. అభిరామ్ జీవితంలో రాశీ ఖన్నాది ముఖ్యమైన పాత్ర. మాళవికా నాయర్ కూడా వందశాతం ఎఫర్ట్ పెట్టి నటించింది. అవికా గోర్ కూడా అద్భుతమైన నటి. ► ‘ఆర్య’ సినిమా నుంచి ‘దిల్’ రాజుగారితో పరిచయం ఉంది. ఇద్దరం కలిసి సినిమా చేయాలనుకున్నాం.. అది ‘థ్యాంక్యూ’తో కుదిరింది. మా కాంబినేషన్లో వస్తున్న పర్ఫెక్ట్ మూవీ ఇది. ఇక మా చిత్రానికి తమన్ అందమైన సంగీతం ఇచ్చారు.. నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది. కెమెరామేన్ పీసీ శ్రీరామ్‌గారితో ‘థ్యాంక్యూ’ నా మూడో సినిమా. ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ అయిన ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశంలోని ఎడిటర్స్‌లో బెస్ట్ ఎడిటర్ నవీన్ నూలిగారు. అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. ► నాగచైతన్యతో నా దర్శకత్వంలో రూపొందుతున్న ‘దూత’ వెబ్ సిరీస్ హారర్ నేపథ్యంలో ఉంటుంది. నాగచైతన్య పోర్షన్ షూటింగ్ పూర్తయింది. పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ► ‘24’ సినిమాకు సీక్వెల్ ఆలోచన ఉంది. వ్యక్తిగతంగా నాకు రొమాంటిక్ జోనర్ సినిమాలంటే ఇష్టం. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత తెలుగులో మైత్రీ మూవీస్ బ్యానర్లో ఓ చిత్రం ఉంటుంది.. -
విదేశాల్లో థ్యాంక్యూ
విదేశాల్లో ‘థ్యాంక్యూ’ చెప్పనున్నారు నాగచైతన్య. ‘మనం’ తర్వాత దర్శకుడు విక్రమ్ కె. కుమార్, హీరో నాగచైతన్య కాంబినేష¯Œ లో రూపొందుతున్న సినిమా ‘థ్యాంక్యూ’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. త్వరలో ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ విదేశాల్లో జరుగనుంది. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. క్రీడా నేపథ్యంలో సాగే సినిమా ఇదని టాక్. అలాగే ఇందులో హీరో మహేశ్‌బాబు అభిమానిగా కనిపిస్తారట నాగచైతన్య. -
అక్టోబర్‌లో స్టార్ట్
‘మనం’ తర్వాత విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో మరోసారి నటిస్తున్నారు నాగచైతన్య. నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారు. ‘థ్యాంక్యూ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు నిర్మిస్తారు. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ కనిపించే అవకాశం ఉందని తెలిసింది. రకుల్ ప్రీత్‌సింగ్, తమిళ నటి ప్రియా భవానీ శంకర్లను ఈ సినిమాలో హీరోయిన్లుగా తీసుకోవాలని చిత్రబృందం అనుకుంటున్నారట. గతంలో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాలో జంటగా నటించారు చైతన్య, రకుల్. మరి ‘థ్యాంక్యూ’లో జంటగా కనిపిస్తారా? అనేది త్వరలో తెలిసిపోతుంది. హీరోయిన్ల గురించి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
లుక్... లుక్... అఖిల్ లవ్ కిక్!
రోడ్డుపై రభస మొదలైంది! ఒకపక్క కార్లు తగలబడుతున్నాయ్. మరోపక్క ప్రాణాలు అరచేత పట్టుకుని కొందరు పరుగులు పెడుతున్నారు. ఇంకొందరు ఓ కుర్రాణ్ణి కుమ్మేయడానికి రెడీ అయ్యారు. అతడికి ఓ అమ్మాయి ముద్దు పెడుతోంది కదా... మిగతా లోకాన్ని మర్చిపోయుంటాడనుకున్నారు. కానీ, ముద్దుకి మురిసిపోతూనే ఆ కుర్రాడు కాలితో గట్టిగా ఓ కిక్ ఇచ్చాడు. ఓ పక్క కిస్... ఇంకోపక్క కిక్... స్టిల్ అదిరింది కదూ! కిస్ పెట్టించుకుంటూ కిక్ ఇచ్చిన ఆ కుర్రాడు అఖిల్. ఈ స్టిల్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అతను హీరోగా నటిస్తున్న సిన్మాలోనిది. శుక్రవారం మధ్యాహ్నమే ఈ స్టిల్ లీక్ కావడంతో రాత్రి అఖిల్ ట్వీట్ చేశారు. ఈనెల 21న మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు. ఈ స్టిల్‌లోని అమ్మాయి హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తారట! -
త్వరలో అనౌన్స్మెంట్!
హైదరాబాదు రోడ్డులో... మెట్రో ట్రైనులో... గూడ్స్ బిల్డింగులో... ఎక్కడ కుదిరితే అక్కడ రౌడీలను కుమ్ముడే కుమ్ముడు! ఓ రొమాన్స్ లేదు.. ఫన్నీ సీన్స్ లేవు.. అన్నీ ఫైట్సే. రెండో కుమారుడు అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఫస్ట్ షెడ్యూల్లో ఓన్లీ ఫైట్స్ తీశారు. రీసెంట్గా మేడ్చల్‌లో రెండో షెడ్యూల్ మొదలైంది. ఇప్పుడు ఏ సీన్స్ తీస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దీంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? షూటింగులో ఆమె ఎప్పుడు జాయిన్ అవుతారనేది ఇంకో సస్పెన్స్. నిజం చెప్పాలంటే... నాగార్జున అండ్ కో అఖిల్‌కు జోడీగా ఓ అమ్మాయిని ఎంపిక చేశారట! త్వరలో ఆమె పేరును అనౌన్స్ చేస్తారట! క్లాస్ అండ్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట! -
ట్రెండ్ సెట్టర్ అవుతుంది – నాగార్జున
అక్కినేని అఖిల్ హీరోగా నటించబోయే రెండో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురు చూస్తున్న అక్కినేని అభిమానుల నిరీక్షణకు ఫుల్స్టాప్ పడింది. అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న సినిమా ఆదివారం సాయంత్రం 6 గంటల 17 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో అక్కినేని కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు కెమేరా స్విచ్ఛాన్ చేయగా, ఏయన్నార్ ముని మనవరాళ్లు సత్య, సాగరి క్లాప్ ఇచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్‌ప్రైజస్ సంస్థలపై రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి మొదలవుతుంది. ‘‘మనం’ టెక్నికల్ టీమ్ వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు నాగర్జున. ‘‘డిఫరెంట్ కమర్షియల్ సినిమా ఇది. క్లాసిక్ హిట్ ‘మనం’ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో మళ్లీ ఓ మంచి సినిమా చేస్తుండడం హ్యాపీగా ఉంది’’ అన్నారు విక్రమ్ కుమార్. యార్లగడ్డ సురేంద్ర, అమల, సుప్రియ, సుమంత్, నాగచైతన్య, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: రాజీవన్, కెమేరా: పి.ఎస్. వినోద్, సంగీతం: అనూప్ రూబెన్స్.