త్వరలో అనౌన్స్‌మెంట్‌! | Akkineni Nagarjuna Akhil is making a film about the movie. | Sakshi
Sakshi News home page

త్వరలో అనౌన్స్‌మెంట్‌!

Published Tue, Jun 27 2017 11:17 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

త్వరలో అనౌన్స్‌మెంట్‌! - Sakshi

త్వరలో అనౌన్స్‌మెంట్‌!

హైదరాబాదు రోడ్డులో... మెట్రో ట్రైనులో... గూడ్స్‌ బిల్డింగులో... ఎక్కడ కుదిరితే అక్కడ రౌడీలను కుమ్ముడే కుమ్ముడు! ఓ రొమాన్స్‌ లేదు.. ఫన్నీ సీన్స్‌ లేవు.. అన్నీ ఫైట్సే. రెండో కుమారుడు అఖిల్‌ హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఫస్ట్‌ షెడ్యూల్‌లో ఓన్లీ ఫైట్స్‌ తీశారు. రీసెంట్‌గా మేడ్చల్‌లో రెండో షెడ్యూల్‌ మొదలైంది. ఇప్పుడు ఏ సీన్స్‌ తీస్తున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. దీంతో పాటు ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు? షూటింగులో ఆమె ఎప్పుడు జాయిన్‌ అవుతారనేది ఇంకో సస్పెన్స్‌. నిజం చెప్పాలంటే... నాగార్జున అండ్‌ కో అఖిల్‌కు జోడీగా ఓ అమ్మాయిని ఎంపిక చేశారట! త్వరలో ఆమె పేరును అనౌన్స్‌ చేస్తారట! క్లాస్‌ అండ్‌ మాస్‌ ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement