
అఖిల్ సినిమాతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్, ఈ ఏడాది చివర్లో హలో అంటూ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తొలి సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవటంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జున దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్న ఈ సినిమాకు మనం ఫేం విక్రమ్ కె కుమార్ దర్శకుడు. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో కన్ఫమ్ గా సక్సెస్ సాధిస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
ఈ సినిమా తరువాత అఖిల్ చేయబోయే సినిమాపై చర్చమొదలైంది. ప్రస్తుతం హలో ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న అఖిల్ తన తదుపరి చిత్రాన్ని మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా భరత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్న కొరటాల ఆ తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ లలో ఒకరితో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.
అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రాజమౌళి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమాకు రెడీ అవుతుండటంతో ఇప్పట్లో వారి డేట్స్ దొరికే అవకాశం లేదు. ఈ గ్యాప్ లో అఖిల్ హీరోగా ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట కొరటాల శివ. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన లేకపోయినా.. వరుస సక్సెస్ లతో దూకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తే అఖిల్ కెరీర్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment