
‘హలో’ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్
హలో సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన అందాల భామ కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన కళ్యాణి తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్ లాంటి స్టార్ హీరో సరసన పరిచయం కావటం కూడా కళ్యాణికి కలిసొచ్చింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో క్రేజ్ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్‌లో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న శర్వానంద్ తదుపరి చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించనుంది. స్వామి రారా ,కేశల లాంటి సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం కళ్యాణిని హీరోయిన్ గా సంప్రదించారట. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.