తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, తన రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కింగ్ నాగార్జున దగ్గరుండి సినిమాకు సంబంధించిన పనులన్ని చూసుకుంటున్నారు. మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ స్టార్ వెంకటేష్ అతిథి పాత్రలో అలరించనున్నారట. ఇటీవల నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ప్రేమమ్ సినిమాలో వెంకీ నటించాడు. ఆ సినిమా ఘనవిజయం సాధించటంతో అదే సెంటిమెంట్ ను అఖిల్ హలో కోసం ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి వెంకటేష్ అతిథి పాత్రపై చిత్రయూనిట్ అధికారిక ప్రకటన చేయకపోయినా.. త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment