సెమీస్‌లో సాకేత్, విష్ణు ద్వయాలు | sanket,vishnu entered in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాకేత్, విష్ణు ద్వయాలు

Published Thu, Feb 13 2014 12:07 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

sanket,vishnu entered in semi finals

కోల్‌కతా: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్‌లు తమ భాగస్వాములతో కలిసి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట 6-3, 6-3తో లుకాస్ పౌలీ (ఫ్రాన్స్)-గో సొయెదా (జపాన్) జోడిని ఓడించగా... విష్ణువర్ధన్-దివిజ్ శరణ్ (భారత్) ద్వయం 6-3, 7-6 (7/4)తో సియెన్ యిన్ పెంగ్-సుంగ్ హువా యాంగ్ (చైనీస్ తైపీ) జోడిపై గెలిచింది.
 
  పురుషుల సింగిల్స్ విభాగంలో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ (భారత్) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టగా... యూకీ బాంబ్రీ (భారత్) ఓడిపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సోమ్‌దేవ్ 6-3, 6-3తో కుద్రయెత్సెవ్ (రష్యా)పై నెగ్గగా... యూకీ బాంబ్రీ 3-6, 4-6తో డాన్‌స్కాయ్ (రష్యా) చేతిలో ఓటమి పాలయ్యాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement