
విష్ణువర్ధన్
చెన్నై: హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ చెన్నై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు విజయం దూరంలో నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌లో విష్ణు 6–3, 6–0తో రామకృష్ణన్ రంగరాజు (భారత్)పై గెలుపొందాడు.
ఆదివారం జరిగే క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో సిద్ధార్థ్ రావత్‌తో విష్ణు ఆడతాడు. మెయిన్ ‘డ్రా’లో నేరుగా చోటు సంపాదించిన సాకేత్ మైనేని, యూకీ బాంబ్రీ, సుమీత్ నాగల్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్, శశికుమార్ ముకుంద్ శనివారం తీవ్రంగా సాధన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment