సాక్షి, హైదరాబాద్ : ఇటీవల విడుదలైన గాయత్రి చిత్రం పైరసీపై నటుడు మోహన్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైరసీకి పాల్పడినవారిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘పైరసీ చేసినవారు, చూసినవారు నికృష్టులు. గాయత్రి సినిమా విషయంలో నా మనసు ఏడుస్తోంది. పైరసీకి పాల్పడినవారు పాపం అనుభవించకతప్పదు. సినిమా కోసం నిర్మాతగా ఎనిమిది నెలలు కష్టపడ్డా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా మంచు విష్ణు, శ్రియ నటించిన ఈ చిత్రానికి మదన్ దర్శకత్వం వహించారు. చాలాకాలం తర్వాత మోహన్‌బాబు హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment