లాక్ డౌన్ కారణంగా తనకి, విష్ణు విశాల్‌కి మధ్య ఏర్పడ్డ దూరాన్ని అయిష్టంగా భావిస్తున్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. ‘‘మిస్ యు’’ అంటూ బాయ్ ఫ్రెండ్ విష్ణు విశాల్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారామె. ఆ పోస్ట్‌కి స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం సామాజిక దూరం పాటించాలి’’ అని సరదాగా అన్నారు విష్ణు విశాల్. తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఇద్దరూ అధికారికంగా చెప్పకపోయినా ఇలాంటి ట్వీట్లు చెబుతున్నాయి. ఈ ఇద్దరూ ఈ ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని టాక్.
Comments
Please login to add a commentAdd a comment