ఆరంభం అదిరిపోవాలి | Aarambham Grand Release on May 10 | Sakshi
Sakshi News home page

ఆరంభం అదిరిపోవాలి

Published Fri, May 10 2024 4:54 AM | Last Updated on Fri, May 10 2024 4:54 AM

Aarambham Grand Release on May 10

‘‘ఆరంభం’ మూవీలోని ఓ పాటని నేను రిలీజ్‌ చేశాను. అప్పుడు ఈ సినిమా టీజర్‌ కూడా చూశానుపాట, టీజర్‌ బాగున్నాయి. నా ఫ్రెండ్‌ ధీరజ్‌ మొగిలినేని ఈ మూవీని డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నాడు. ‘ఆరంభం’ అదిరిపోవాలి. మంచి కథ కుదిరితే ఈ టీమ్‌తో సినిమా చేయాలనిపిస్తోంది’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. మోహన్‌ భగత్, సుప్రితా సత్యనారాయణ్‌ జంటగా నటించిన సినిమా ‘ఆరంభం’. అజయ్‌ నాగ్‌ వి. దర్శకత్వంలో అభిషేక్‌ వీటీ నిర్మించిన ఈ మూవీ నేడు రిలీజ్‌ అవుతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి శ్రీ విష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిషేక్‌ వీటీ మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘మా మూవీ ఎలా ఉంటుందనే ప్రశ్నలకు ట్రైలర్‌తో సమాధానం దొరికిందని భావిస్తున్నాను’’ అన్నారు అజయ్‌ నాగ్‌. ‘‘మా అమ్మ ఇటీవలే దూరమయ్యారు. ఆమె ఓ శక్తిలా నన్ను ముందుకు నడిపిస్తోందని భావిస్తున్నాను’’ అన్నారు మోహన్‌ భగత్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement