విష్ణు విశాల్‌తో మియాజార్జ్ | Mia georg act with Vishnu Vishal | Sakshi
Sakshi News home page

విష్ణు విశాల్‌తో మియాజార్జ్

Published Tue, Dec 23 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

విష్ణు విశాల్‌తో మియాజార్జ్

విష్ణు విశాల్‌తో మియాజార్జ్

అమరకావ్యం చిత్ర హీరోయిన్ మియాజార్జ్‌కు తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. ఆర్య తమ్ముడు సత్యతో జత కట్టిన అమరకావ్యం

 అమరకావ్యం చిత్ర హీరోయిన్ మియాజార్జ్‌కు తాజాగా కోలీవుడ్‌లో మరో అవకాశం వచ్చింది. ఆర్య తమ్ముడు సత్యతో జత కట్టిన అమరకావ్యం ఆశించిన విజయం సాధించకపోయినా మియాజార్జ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయినా వెంటనే మరిన్ని అవకాశాలు ఈ మలయాళీ బ్యూటీని వరించలేదు. తాను అవకాశాల కోసం వెంటపడలేదని, ఎంచుకున్న పాత్రలే చేయాలనుకుంటున్న మియాకు కాస్త ఆలస్యంగా అయినా మంచి అవకాశమే వరించింది. ముదిరాసుపట్టి, జీవా చిత్రాల విజయాలతో మంచి జోష్‌లో వున్న యువ నటుడు విష్ణు విశాల్‌తో ఫాంటసీ కథా చిత్రంలో నటించే అవకాశం లభించింది.
 
 హిట్ చిత్రాల నిర్మాత సి.వి.కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇండ్రు నేట్రు నాళై అనే టైటిల్‌ను నిర్ణయించారు. నవ దర్శకుడు రవికుమార్ తయారు చేసిప ఈ చిత్ర కథ బాగా ఇంప్రెస్ చేయడంతో వెంటనే నిర్మించడానికి రెడీ అయినట్లు నిర్మాత సి.వి.కుమార్ చెబుతున్నారు. ఎన్ని చిత్రాలు చేశామన్నది కాకుండా మంచి చిత్రాల్లో తానుండాలని కోరుకుంటున్నానన్నారు. నటి మియాజార్జ్ ఇండ్రు నేట్రు నాళై చిత్ర కథ తనకు బాగా నచ్చిందన్నారు. తనకు తమిళ భాష స్పష్టంగా మాట్లాడడం రాకపోయినా నేర్చుకుంటున్నానని తెలిపారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హీరోకు ధనవంతురాలైన హీరోయిన్‌కు మధ్య ప్రేమ చిత్ర ప్రధాన ఇతివృత్తం అని దర్శకుడు తెలిపారు. కరుణాకరన్ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు సాయిరవి విలన్‌గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు వినూత్న అనుభవాన్ని కలిగిస్తుందనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement