నైపుణ్యాల లేమితో ఉపాధిలో వెనుకబాటు
భీమవరం : ఇంజినీరింగ్ విద్యార్థుల్లో భాషాపరమైన, భావ ప్రకటనకు సంబంధించిన నైపుణ్యాలు తక్కువగా ఉండటంతో ఉపాధి అవకాశాలు పొందడంలో వెనుకబడిపోతున్నారని రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.లక్ష్మీనారాయణ అన్నారు. భీమవరం బీవీ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో శనివారం జరిగిన విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువ ఇంజినీర్లు ఆంగ్లంపై పట్టు సాధించాలని, ఇందుకు దిన, వార పత్రికలు చదవాలని సూచించారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తితో పాటు సమస్య విశ్లేషణ, పరి ష్కార మార్గాల రూపకల్పన, సంక్లిష్ట సమస్యను పూర్తిగా అర్థం చేసుకో వడం, అత్యాధునిక పరికరాల విని యోగం, భావప్రకటన నైపుణ్యం, నా యకత్వ లక్షణాలు వంటివి కలిగి ఉండాలన్నారు. వాస్తవిక సమస్యలను పరిష్కరిస్తూ మౌలికాంశాలపై అవగాహన ఏర్పరుచుకోవాలని సూచిం చారు. చదువుతో పాటు ప్రాజెక్ట్ రూపకల్పనలో ఆసక్తి చూపినప్పుడే భవిష్య త్ బాగుంటుందన్నారు. విట్ కళాశాల ప్రిన్సిపాల్ దశిక సూర్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుకోవాలన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలపైఅవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సి పాల్ జి.శ్రీనివాసరావు మాట్లాడారు. అనంతరం కళాశాల యాజమాన్యం లక్ష్మీనారాయణను సత్కరించింది. కళాశాల డైరెక్టర్ జె.ప్రసాదరాజు, వైస్ ప్రిన్సిపాల్ పి.శ్రీనివాసరాజు తదితరు లు పాల్గొన్నారు.