
మరో నయీమ్‌గా మారిన విష్ణు
గూడూరు(కర్నూలు జిల్లా): టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి అక్రమాలు, దౌర్జన్యాలు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ మరో నయీంను తలపిస్తున్నారని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ స్థానిక నాయకుడు డీటీ విఠల్ గహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేదలు, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. ప్రతి గ్రామంలో ఐదారుగురు రౌడీలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా దందాలు సాగిస్తున్నారన్నారు. విష్ణు అనుచరుడు, గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ సుభాషిణి బావ కరుణాకరరాజు మున్సిపాల్టీలో పెత్తనం చెలాయిస్తున్నాడన్నారు. రూ.లక్ష ప్రకారం ఇప్పించుకుని 40 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించుకున్నాడని, అపర్డబుల్ హౌసింగ్ సొసైటీ పేరుతో 100 మంది నుంచి రూ. 50 వేల చొప్పున వసూలు చేశాడన్నారు.
మునుగాల ఎత్తిపోతల పథకాన్ని చేతుల్లోకి తీసుకుని వసూళ్లు సాగిస్తున్నాడన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతూ ప్రశ్నించిన వారి నోరు మూయిస్తున్నాడని, చివరకు ఎల్లెల్సీ అధికారులనూ భయపెట్టి అధికారం చెలాయిస్తున్నాడని కొత్తకోట ఆందోళన వ్యక్తం చేశారు. విష్ణు అక్రమాలను నియంత్రించాల్సిన ఎమ్మెల్యే మణిగాంధీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా విష్ణు అక్రమాలను సీఎం దష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
అనంతరం విష్ణు అనుచరులు కరుణాకరరాజు, గుడిపాడు మహేశ్వరరెడ్డిపై కొత్తకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి డబ్బు వసూలు చేసిన రశీదులు, ఆధారాలతో ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. కొత్తకోట వెంట గూడూరు, సి.బెళగల్, కర్నూలు మండలాల పార్టీ కన్వీనర్లు ఎల్.భాస్కర్‌రెడ్డి, ఎర్రన్న, వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా కార్యదర్శి చనుగొండ్ల దౌలా, కర్నూలు మండల కార్యదర్శి ఎం.సయ్యద్‌సాహెబ్, స్థానిక నేతలున్నారు.