
హాస్యభరితంగా ఇవన్ యారెండ్రు తెరిగిరదా
ప్రేక్షకుల మధ్య ఎవర్‌గ్రీన్ చిత్రాలంటే వినోదభరిత కథా చిత్రాలే. ఆ తరహాలో వస్తున్న చిత్రం ఇవన్ యారెండ్రు తిరిగిరదా. దర్శకుడు సుశీంద్రన్ శిష్యుడు ఎస్‌టీ.సురేశ్‌కుమార్ మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం ఇది. ఒన్ సినిమా పతాకంపై టీఈ.అశోక్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు, వర్ష, ఇషారానాయర్, కే.భాగ్యరాజ్, జయప్రకాశ్, అరుళ్‌దాస్, భగవతి పెరుమాళ్, రామ్, అర్జున్, రాజ్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు.
చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమికులరోజున పుట్టిన హీరో ప్రేమించడానికి ప్రియురాలు లభించిందా? లేదా? అన్న ఇతివృత్తంతో ప్రేమ, హాస్యానికి పెద్ద పీట వేసి తెరకెక్కించిన చిత్రం ఇవన్ యారెండ్రు తెరిగిరదా అని తెలిపారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ ధ్రువపత్రం పొందిందని చెప్పారు.
చిత్రాన్ని వినోదపు పన్ను రద్దు కమిటీకి ప్రదర్శించగా వారు కడపుబ్బ నవ్వుకున్నట్లు ప్రశంసించారని తెలిపారు. ఆ కమిటీలో సభ్యులైన ప్రముఖ దర్శకుడు పి.వాసు చాలా కాలం తరువాత తనను తాను మరచేలా మీ చిత్రం నవ్వించిందని అభినందించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి పీ అండ్ జీ చాయాగ్రహణం, ఎన్‌ఆర్.రఘునందన్ సంగీతాన్ని, పాటలను యుగభారతి, ఎడిటింగ్‌ను గోపీకృష్ణ, ఫైట్స్ కంపోజింగ్‌ను కబాలి ఫేమ్ అన్బరివు నిర్వహించినట్లు దర్శకుడు వెల్లడించారు.