ఒంటరైన మృతుల కుమారుడు
చైల్డ్‌లైన్‌కు అప్పగించిన పోలీసులు
కేసముద్రం : తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో ఆ బాలుడు ఒంటరయ్యూడు. అక్కున చేర్చుకునేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో అనాథగా మారాడు. తల్లిదండ్రులకు ఏమైందో.. వారు ఎందుకు కనిపించడం లేదో అర్థం కాని ఆ బాలుడు అమాయకంగా బిత్తర చూపులు చూస్తున్నాడు. అంత్యక్రియల తర్వాత బంధువులంతా ఎవరిదారిన వారు వెళ్లిపోయూరు. కన్నీరుకార్చడం తప్ప ఏమి చేయలేని దుస్థితి స్థానికులది. కేసముద్రంస్టేషన్‌లో స్థాని కులను కలచివేసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు. పట్టణానికి చెందిన గుడ్ల వెంకట్రామయ్య, సరస్వతి దంపతులు ఈ నెల 7న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి అంత్యక్రియలు పూర్తయ్యూక బంధువులు తమ ఇళ్లకు వెళ్లిపోయూరు. తలకొరివి పెట్టిన మృతుల మూడేళ్ల కుమారుడు విష్ణును తీసుకెళ్లేందుకు ఇరువైపుల బంధువులు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో స్థానికులు, కులపెద్దమనుషులే రాత్రంతా ఆ బాలుడికి ఆశ్రయమిచ్చారు. తిరిగి సోమవారం మళ్లీ బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదు. హత్యకు గురైన వాళ్ల బిడ్డను చేరదీస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని కొందరు, భారమవుతాడేమోనని మరి కొందరు ఆలోచించడాన్ని సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేసింది.
చిన్న వయసులోనే ఎం తటి కష్టమొచ్చింది కొడుకా అంటూ స్థానికులు కన్నీరుపెట్టడం తప్ప ఏమి చేయలేకపోయూరు. చివరికి చేసేదిలేక సోమవారం సాయంత్రం పోలీసులు చైల్డ్‌లైన్ మానుకోట వలంటీర్లు అరుణ, మహేష్, వెంకటేష్‌కు ఎస్సై ఫణిదర్, కులపెద్దమనిషి ఊరుగొండశ్రీరామలు కలిసి అప్పగించారు. అనంతరం బాలుడిని వరంగల్‌లోని సీడబ్ల్యూసీ మెజిస్ట్రేట్ అనితారెడ్డి ఎదుట హాజరుపరిచి, అనంతరం శిశువిహార్‌కు తరలించనున్నట్లు వలంటీర్లు తెలిపారు.
వీడనున్న దంపతుల హత్య కేసు మిస్టరీ ?
కలకలం రేపిన దంపతుల హత్య కేసు మిస్టరీ వీడనుంది. ఇప్పటికే పోలీసులు ఈ హత్యోదంతంపై పలు కోణాల్లో దర్యాప్తు సాగించారు. చివరకు ఈ హత్య కేసు ఛేదించి అంగంతకులను పట్టుకున్నట్లు తెలిసింది. హతులైన గుడ్ల వెంకట్రామయ్య, సరస్వతి కుటుంబ సభ్యులపైనే మొదటి నుండి అనుమానాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. హతురాలి మెడలో ఉన్న బంగారం చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దొంగలు చేసి ఉండరని, తెలిసినవారే చేసి ఉం టారనే కోణంలో దర్యాప్తు సాగింది. ఈ మేరకు హతుల కుమారుడిని, కోడలిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ లో హత్యలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పసిబాలుడిని కూడా చంపాలని భావించిన అగంతకులు అతడు ఏడవడంతో ఎవరైనా వస్తారనే భయంతో పరారైనట్లు సమాచారం.
ముద్దుల బాబు.. ఎవరికి వద్దట..
Published Tue, Feb 10 2015 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM
Advertisement
Advertisement