parents killed
-
కొడుకును తాళ్లతో కట్టేసి..కిరోసిన్ పోసి..
-
కన్న పేగునే కాల్చేశారు
దామెర: మద్యానికి బానిసై ఇంట్లో గొడవలకు కారణమవుతున్న ఓ కొడుకును తల్లిదండ్రులే కడతేర్చారు. ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ హృదయ విదారక ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం ముస్త్యాలపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కడారి ప్రభాకర్, విమల దంపతుల పెద్ద కుమారుడు మహేష్ చంద్ర (42). మహేష్ భార్య రాధికను డబ్బుల కోసం వేధిస్తుండటం, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె ఇటీవల పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి మహేష్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో నిత్యం ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళ వారం రాత్రి మహేష్ మద్యం సేవించి వచ్చి తల్లిదండ్రులతో గొడవకు దిగాడు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు మహేష్‌ను ఇంటి ముందు వరండాలో తాళ్లతో కట్టేసి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. స్థానికులు మంటలను ఆర్పి అతడిని కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే సజీవ దహనమయ్యాడు. పరకాల ఏసీపీ శ్రీనివాస్, శాయంపేట సీఐ ఎస్.వెంకటేశ్వర్రావు, ఎస్ఐ యు.భాస్కర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితులుగా భావిస్తున్న కడారి ప్రభాకర్, విమలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఇలా బతకటం కంటే...
చలాకీగా ఉంటూ అందరితో సరదాగా గడిపే యువతి. అయితే అరుదైన వ్యాధి ఆమెను మానసికంగా కుంగదీసింది. లాభం లేదనుకున్న యువతి.. తల్లిదండ్రులను చంపి, ఆత్మహత్య చేసుకుంది. ఫాదర్స్ డే రోజున హంగ్ కాంగ్లో జరిగిన విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే... హంగ్ కాంగ్ సిటీ: ట్యూన్ మూన్‌కు చెందిన పాంగ్ చింగ్-యూ(23) నర్సింగ్ విద్యార్థిని. చదువులతోపాటు ఆటల్లో చురుకుగా ఉండే యువతి. అయితే కొన్నాళ్లుగా ఆమె ఎక్జిమా(చర్మ వ్యాధితో)తో బాధపడుతోంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన ఆమె దారుణానికి పాల్పడింది. ఈ నెల 17వ తేదీన తల్లిదండ్రులను కత్తితో పొడిచి, ఆపై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. పాంగ్ బెడ్ రూమ్‌లో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు మీడియాకు విడుదల చేశారు. ‘ఎక్జిమా వ్యాధిగ్రస్తులకు పిల్లలుగా పుట్టడం కంటే.. పేదరికంలో పుట్టడం చాలా నయం. ఎందుకంటే పేదరికంలో పుడితే.. బతుకులను మార్చుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఎక్జిమాతో పుడితే చచ్చేదాకా అంతే. సూర్య కాంతిని, అంతెందుకు... అద్దంలో నా ముఖం నేను చూసుకోలేని పరిస్థితి. ఇలాంటి బతుకు కంటే చావటం మంచిదని నిర్ణయించుకున్నా. నా ఈ పరిస్థితికి నా పెరెంట్సే కారణం. అందుకు వాళ్లను కూడా తీసుకుపోతున్నా’ అని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది. ఎక్జిమా అన్నది సాధారణంగా చిన్న పిల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగని పెద్దయ్యాక కూడా దాని లక్షణాలు బయటపడ్డవారు చాలా మందే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఎక్జిమా చికిత్స కోసం వాడే మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా డిప్రెషన్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్జిమాతో బాధపడుతున్న వారిలో 30 శాతం డిప్రెషన్‌తో కూడా బాధపడుతుండటమే ఇందుకు తార్కాణమని వైద్యులు తెలిపారు.(ఎక్జిమాకి వైద్యం ఏదీ లేదు. కనుక, బాధను తగ్గించడం మరియు దురద నుండి ఉపశమనం లాంటి చికిత్సలు మాత్రమే ఉన్నాయి) -
ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దారుణ హత్యలు
తన సొంత తల్లిదండ్రులతో పాటు సోదరిని, అత్తను కూడా వాళ్ల ఇంట్లోనే దారుణాతి దారుణంగా చంపిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలన్నీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కేబినెట్లోని ఎనిమిది మంది మంత్రుల నివాసాలకు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. ఈ హత్యలకు పాల్పడిన కేదల్ జైసన్ (30) అనే వ్యక్తి రైలు ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్టేషన్లో పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ రాజ్ తనకం, ఆయన భార్య, ప్రభుత్వాస్పత్రిలో రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ జీన్ పద్మ, వాళ్ల కుమార్తె, వైద్య విద్యార్థిని కరోల్, ఆమె అత్త లలిత.. ఈ నలుగురి మృతదేహాలను పోలీసులు వాళ్ల ఇంట్లోనే గుర్తించారు. మూడు మృతదేహాలు పూర్తిగా తగలబడిన స్థితిలో ఉండగా, ఒకటి మాత్రం బ్యాగులో చుట్టి ఉంది. ఆ ఇంటి నుంచి పొగ వస్తున్నట్లు ఇరుగుపొరుగు వారు గుర్తించడంతో వాళ్లు అగ్నిమాపక శాఖకు సమాచారం తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పిన తర్వాతే మృతదేహాలు బయటపడ్డాయి. ఇంటి నుంచి అర్ధరాత్రి సమయంలో ఎవరో పారిపోతున్నారని తమకు సమాచారం రావడంతో పెట్రోలింగ్ సిబ్బందిని అటు పంపగా, జైసన్ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. తన తల్లిదండ్రులు, మిగిలిన వాళ్లు అంతా టూర్ వెళ్లారని, వారం వరకు తిరిగి రారని అతడు తమకు చెప్పినట్లు జైసన్ బంధువులు చెప్పారు. -
ముద్దుల బాబు.. ఎవరికి వద్దట..
ఒంటరైన మృతుల కుమారుడు చైల్డ్‌లైన్‌కు అప్పగించిన పోలీసులు కేసముద్రం : తల్లిదండ్రులు హత్యకు గురికావడంతో ఆ బాలుడు ఒంటరయ్యూడు. అక్కున చేర్చుకునేందుకు ఒక్కరూ ముందుకు రాకపోవడంతో అనాథగా మారాడు. తల్లిదండ్రులకు ఏమైందో.. వారు ఎందుకు కనిపించడం లేదో అర్థం కాని ఆ బాలుడు అమాయకంగా బిత్తర చూపులు చూస్తున్నాడు. అంత్యక్రియల తర్వాత బంధువులంతా ఎవరిదారిన వారు వెళ్లిపోయూరు. కన్నీరుకార్చడం తప్ప ఏమి చేయలేని దుస్థితి స్థానికులది. కేసముద్రంస్టేషన్‌లో స్థాని కులను కలచివేసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నారుు. పట్టణానికి చెందిన గుడ్ల వెంకట్రామయ్య, సరస్వతి దంపతులు ఈ నెల 7న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి అంత్యక్రియలు పూర్తయ్యూక బంధువులు తమ ఇళ్లకు వెళ్లిపోయూరు. తలకొరివి పెట్టిన మృతుల మూడేళ్ల కుమారుడు విష్ణును తీసుకెళ్లేందుకు ఇరువైపుల బంధువులు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో స్థానికులు, కులపెద్దమనుషులే రాత్రంతా ఆ బాలుడికి ఆశ్రయమిచ్చారు. తిరిగి సోమవారం మళ్లీ బంధువులకు పోలీసులు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదు. హత్యకు గురైన వాళ్ల బిడ్డను చేరదీస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని కొందరు, భారమవుతాడేమోనని మరి కొందరు ఆలోచించడాన్ని సభ్యసమాజాన్ని తల దించుకునేలా చేసింది. చిన్న వయసులోనే ఎం తటి కష్టమొచ్చింది కొడుకా అంటూ స్థానికులు కన్నీరుపెట్టడం తప్ప ఏమి చేయలేకపోయూరు. చివరికి చేసేదిలేక సోమవారం సాయంత్రం పోలీసులు చైల్డ్‌లైన్ మానుకోట వలంటీర్లు అరుణ, మహేష్, వెంకటేష్‌కు ఎస్సై ఫణిదర్, కులపెద్దమనిషి ఊరుగొండశ్రీరామలు కలిసి అప్పగించారు. అనంతరం బాలుడిని వరంగల్‌లోని సీడబ్ల్యూసీ మెజిస్ట్రేట్ అనితారెడ్డి ఎదుట హాజరుపరిచి, అనంతరం శిశువిహార్‌కు తరలించనున్నట్లు వలంటీర్లు తెలిపారు. వీడనున్న దంపతుల హత్య కేసు మిస్టరీ ? కలకలం రేపిన దంపతుల హత్య కేసు మిస్టరీ వీడనుంది. ఇప్పటికే పోలీసులు ఈ హత్యోదంతంపై పలు కోణాల్లో దర్యాప్తు సాగించారు. చివరకు ఈ హత్య కేసు ఛేదించి అంగంతకులను పట్టుకున్నట్లు తెలిసింది. హతులైన గుడ్ల వెంకట్రామయ్య, సరస్వతి కుటుంబ సభ్యులపైనే మొదటి నుండి అనుమానాలు తలెత్తుతున్న విషయం తెలిసిందే. హతురాలి మెడలో ఉన్న బంగారం చోరీకి గురికాకపోవడంతో ఈ హత్య దొంగలు చేసి ఉండరని, తెలిసినవారే చేసి ఉం టారనే కోణంలో దర్యాప్తు సాగింది. ఈ మేరకు హతుల కుమారుడిని, కోడలిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ లో హత్యలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పసిబాలుడిని కూడా చంపాలని భావించిన అగంతకులు అతడు ఏడవడంతో ఎవరైనా వస్తారనే భయంతో పరారైనట్లు సమాచారం.