ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దారుణ హత్యలు | man kills parents, sister and aunt near chief minister residence | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దారుణ హత్యలు

Published Tue, Apr 11 2017 3:28 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దారుణ హత్యలు

ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దారుణ హత్యలు

తన సొంత తల్లిదండ్రులతో పాటు సోదరిని, అత్తను కూడా వాళ్ల ఇంట్లోనే దారుణాతి దారుణంగా చంపిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలన్నీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆయన కేబినెట్‌లోని ఎనిమిది మంది మంత్రుల నివాసాలకు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. ఈ హత్యలకు పాల్పడిన కేదల్‌ జైసన్‌ (30) అనే వ్యక్తి రైలు ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్టేషన్‌లో పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాజ్‌ తనకం, ఆయన భార్య, ప్రభుత్వాస్పత్రిలో రిటైర్డ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ జీన్‌ పద్మ, వాళ్ల కుమార్తె, వైద్య విద్యార్థిని కరోల్‌, ఆమె అత్త లలిత.. ఈ నలుగురి మృతదేహాలను పోలీసులు వాళ్ల ఇంట్లోనే గుర్తించారు. మూడు మృతదేహాలు పూర్తిగా తగలబడిన స్థితిలో ఉండగా, ఒకటి మాత్రం బ్యాగులో చుట్టి ఉంది.

ఆ ఇంటి నుంచి పొగ వస్తున్నట్లు ఇరుగుపొరుగు వారు గుర్తించడంతో వాళ్లు అగ్నిమాపక శాఖకు సమాచారం తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పిన తర్వాతే మృతదేహాలు బయటపడ్డాయి. ఇంటి నుంచి అర్ధరాత్రి సమయంలో ఎవరో పారిపోతున్నారని తమకు సమాచారం రావడంతో పెట్రోలింగ్‌ సిబ్బందిని అటు పంపగా, జైసన్‌ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. తన తల్లిదండ్రులు, మిగిలిన వాళ్లు అంతా టూర్‌ వెళ్లారని, వారం వరకు తిరిగి రారని అతడు తమకు చెప్పినట్లు జైసన్‌ బంధువులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement