four murders
-
అప్పులబాధతోనే అఘాయిత్యం!
-
అప్పులబాధతోనే అఘాయిత్యం!
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ నార్సింగ్ ఠాణా పరిధిలోని కొల్లూరు సమీపంలో చోటు చేసుకున్న ‘నాలుగు హత్యలు, ఒక ఆత్మహత్య’ కేసు మిస్టరీని ఛేదించడానికి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమికంగా అప్పులభారం పెరగడంతోనే ప్రభాకర్‌రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అయితే, పిన్ని లక్ష్మి, ఆమె కుమార్తెలకు విషం ఇవ్వడం వెనుక ఉన్న అసలు విషయం వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. షేర్ల వ్యాపారంలో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఇటీవల కాలంలో భారీగా నష్టపోయినట్లు తెలిసింది. దీంతో అనేకమంది నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకువచ్చినట్లు సమాచారం. గడిచిన నెల రోజులుగా ప్రభాకర్‌రెడ్డి షేర్ మార్కెట్లో భారీ మొత్తం వెచ్చించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నూటికి రూ.3 నుంచి రూ.5 వడ్డీకి కొందరి నుంచి తక్కువ కాలంలోనే మీ మొత్తం రెట్టింపు చేస్తానంటూ హామీ ఇచ్చి మరికొందరి నుంచి డబ్బు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా ప్రభాకర్‌రెడ్డికి డబ్బు ఇచ్చిన వాళ్ళు ఒక్కొక్కరుగా నార్సింగ్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి ఈ మొత్తం రూ.7 కోట్లుగా ఉన్నట్లు తేలిందని పోలీసులు చెప్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి పిన్ని లక్ష్మీ అతడికి ఎంత మొత్తం ఇచ్చారు? ఆ నగదు ఎక్కడ నుంచి తీసుకువచ్చారు? అనే అంశాలను పరిశీలిస్తున్నామని, దీనిపై స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంటున్నారు. ఈ ఉదంతం చోటు చేసుకోవడానికి అప్పు ఇవ్వడమే కారణమా? మరే ఇతర కారణం ఉందా? అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డితో పాటు లక్ష్మీకి చెందిన సెల్‌ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తున్న పోలీసులు ఆఖరిసారిగా ఎవరితో సంప్రదింపులు జరిపారు? ఏం మాట్లాడారు? వారితో వీరికి ఉన్న లావాదేవీలు ఏంటి? అనేవి తెలుసుకుంటున్నారు. దీనికోసం ఆయా నంబర్లకు ఫోన్లు చేస్తున్న పోలీసులు వారితో మాట్లాడుతున్నారు. మరోపక్క ప్రభాకర్‌రెడ్డి ఇంటి నుంచి సేకరించిన ల్యాప్‌టాప్‌లోని అంశాలను విశ్లేషిస్తున్నారు. ఈ కేసు విషయమై సోమవారం నాటికి స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ప్రభాకర్‌రెడ్డికి అప్పులు ఇచ్చిన, అతడి వద్ద పెట్టుబడులు పెట్టిన వారు పదుల సంఖ్యలో ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. -
ముఖ్యమంత్రి ఇంటి పక్కనే దారుణ హత్యలు
తన సొంత తల్లిదండ్రులతో పాటు సోదరిని, అత్తను కూడా వాళ్ల ఇంట్లోనే దారుణాతి దారుణంగా చంపిన వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యలన్నీ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కేబినెట్లోని ఎనిమిది మంది మంత్రుల నివాసాలకు కూతవేటు దూరంలోనే జరగడం గమనార్హం. ఈ హత్యలకు పాల్పడిన కేదల్ జైసన్ (30) అనే వ్యక్తి రైలు ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా స్టేషన్లో పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్ రాజ్ తనకం, ఆయన భార్య, ప్రభుత్వాస్పత్రిలో రిటైర్డ్ మెడికల్ సూపరింటెండెంట్ జీన్ పద్మ, వాళ్ల కుమార్తె, వైద్య విద్యార్థిని కరోల్, ఆమె అత్త లలిత.. ఈ నలుగురి మృతదేహాలను పోలీసులు వాళ్ల ఇంట్లోనే గుర్తించారు. మూడు మృతదేహాలు పూర్తిగా తగలబడిన స్థితిలో ఉండగా, ఒకటి మాత్రం బ్యాగులో చుట్టి ఉంది. ఆ ఇంటి నుంచి పొగ వస్తున్నట్లు ఇరుగుపొరుగు వారు గుర్తించడంతో వాళ్లు అగ్నిమాపక శాఖకు సమాచారం తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పిన తర్వాతే మృతదేహాలు బయటపడ్డాయి. ఇంటి నుంచి అర్ధరాత్రి సమయంలో ఎవరో పారిపోతున్నారని తమకు సమాచారం రావడంతో పెట్రోలింగ్ సిబ్బందిని అటు పంపగా, జైసన్ పట్టుబడ్డాడని పోలీసులు తెలిపారు. తన తల్లిదండ్రులు, మిగిలిన వాళ్లు అంతా టూర్ వెళ్లారని, వారం వరకు తిరిగి రారని అతడు తమకు చెప్పినట్లు జైసన్ బంధువులు చెప్పారు. -
నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు
-
నయీమ్ డెన్‌లో నాలుగు మర్డర్లు
* అల్కాపురిలో టౌన్‌షిప్‌లోని అతడి నివాసం ఓ నరకకూపం * అనేక మంది బాలికలపై అకృత్యాలు సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ అకృత్యాలు ఒక్కోక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నార్సింగి పోలీసుస్టేషన్ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లో ఉన్న ఇతడి డెన్‌లో నాలుగు హత్యలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. హత్యకు గురైనవారిలో ఓ మైనర్ బాలికతోపాటు ఓ పసికందు, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్టు తేలింది. బాలికను కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపగా.. పసికందును నేలకేసి కొట్టి ప్రాణాలు తీశారు. కోర్టు అనుమతితో ఫర్హానా, అఫ్షాలను కస్టడీలోకి తీసుకుని విచారించిన నార్సింగి పోలీసులు అనేక కీలకాంశాలు రాబట్టారు. నయీమ్‌కు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన టెక్ మధు.. నెలల రోజుల పిల్లల్ని సైతం తీసుకువచ్చి నయీమ్‌కు అప్పగించినట్లు వెల్లడైంది. అల్కాపురి టౌన్షిప్పై సోమవారం నార్సింగి పోలీసులు దాడి చేసినప్పుడు అక్కడున్న 11 మంది పిల్లల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది నయీమ్‌తో పాటు ఫర్హానా, అఫ్షాలతో ఎలాంటి సంబంధం లేనివారు ఉండటంతో వారిని సైదాబాద్, హైదర్షాకోట్ల్లోని శరణాలయాల్లో చేర్పించారు. వీరి నుంచి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు ఆ ఇంట్లో మొత్తం 24 మంది పిల్లలు ఉండే వారని గుర్తించారు. తమలో ఇద్దరిని ఇటీవలే ఓ మహిళ తీసుకువె ళ్లిందని చిన్నారులు బయటపెట్టారు. మిగిలిన వాళ్లు ఏమయ్యారనే కోణంపై దృష్టిపెట్టిన పోలీసు ఫర్హానా, అఫ్షాలను ఆ కోణంలో ప్రశ్నించారు. నయీమ్ కొందరు పిల్లలు, యువతులతో పాటు 16 ఏళ్ల లోపు బాలికల్నీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలిసింది. పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు. బాలికలకు మత్తు మందు ఇస్తూ అకృత్యాలు.. నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నయీమ్ అనుచరులు యువతులతో పాటు బాలికలను ఉపాధి పేరుతో తీసుకువచ్చేవారు. వీరందరినీ తన ఆధీనంలోని తీసుకునే నయీమ్.. ఫర్హానాతో పాటు అఫ్షాలకు అప్పగించే వాడు. బాలికలకు మత్తమందులు ఇచ్చే నయీమ్ వారిపై శారీరక, మానసిక అకృత్యాలకు పాల్పడేవాడు. ఒప్పుకోని బాలికలను సున్నిత అవయవాలపై కొడుతూ హింసించేవాడు. నయీమ్ సమీప బంధువులు సైతం ఈ ఇంటికి వచ్చి వెళ్తూ వారిపై అఘాయిత్యాలకు పాల్పడేవారు. ఆపై గోవా, ముంబైతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించి అమ్మేసేవాడు. నల్లగొండకు చెందిన ఓ బాలిక నయీమ్ అకృత్యాలను ఎదిరించింది. దీంతో నయీమ్, ఫర్హానా తదితరులు తల్వార్లు, గొడ్డళ్లతో దాడి చేసి ఇంట్లోనే ఆ బాలికను దారుణంగా హత్య చేశారు. ఆ దృశ్యం చూసిన మిగిలిన మైనర్లు కొన్ని రోజుల పాటు అన్నపానీయాలు సైతం ముట్టుకోలేదు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మిగిలిన బాలికలతో ఇంటిని శుభ్రం చేయించడంతో పాటు నయీమ్... ఆమె మృతదేహాన్ని వాహనంలో తీసుకువె ళ్లి మాయం చేశాడు. ఇలా చాలామంది మైనర్లపై అకృత్యాలు జరిగినట్టు ఫర్హానా, అఫ్షాలు పోలీసు కస్టడీలో వెల్లడించారు. దీంతో శుక్రవారం ఫోరెన్సిక్ నిపుణులను ఆ ఇంటికి తీసుకువెళ్లిన పోలీసులు పలు కీలకాధారాలు, నమూనాలు సేకరించారు. ఈ హత్య, మైనర్లపై అత్యాచారం, లైంగిక వేధింపుల విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు ఈ కేసులో హత్య తదితర ఆరోపణలకు సంబంధించిన సెక్షన్లనూ చేర్చారు. కేసులో ఫర్హానా, అఫ్షాలతో పాటు నయీమ్ కుటుంబాన్నీ నిందితులుగా పేర్కొన్నారు. కస్టడీ పొడిగించండి.. ఫర్హానా, అఫ్షా మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు కస్టడీ ముగియడంతో శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ఉప్పర్‌పల్లి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణను న్యాయస్థానం ఈ నెల 16కు వాయిదా వేసింది. ఫర్హానా, అఫ్షాలకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో వారిని జైలుకు తరలించారు. ఇప్పటికే చత్తీస్గడ్, గోవా, ఆంధ్రప్రదేశ్‌ల్లో నయీమ్‌కు స్థిర, చరాస్తులు ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు తాజాగా ఫర్హానా, ఆఫ్షాలు చెప్పిన విషయాలతో జబల్పూర్, ముంబైల్లోనూ భారీగానే ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. భూవివాదంలో ఇద్దరి హత్య ముగ్గురు వ్యక్తులు కలిసి శంషాబాద్‌లో రూ.6 కోట్లకు ఓ చోట భూమి కొన్నారు. గొడవలు రావడంతో వీరిలో ఓ వ్యక్తిని మిగతా ఇద్దరు కలసి పక్కనపెట్టేశారు. దీంతో అతడు నయీమ్‌ను కలిసి.. మ్యాటర్ సెటిల్ చేస్తే ల్యాండ్‌లో 30% వాటా ఇస్తానని చెప్పాడు. దీంతో నయీమ్ వారిద్దరిని తన ఇంటికి పిలిపించుకొని సంతకాలు పెట్టించుకున్నాడు. తర్వాత వారిని అల్కాపురిలోని తన ఇంటికి సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశాడు. అనంతరం తనను మొదట కలిసి వ్యక్తికే 30% వాటా ఇచ్చి నయీమ్ ఆ స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. -
రెండేళ్లలో నాలుగు హత్యలు
నిందితులను గుర్తించడంలో పోలీసుల వైఫల్యం డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పోలీసులకు చాలెంజ్ సామర్లకోట: డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గంలో దొంగతనాలతోపాటు హత్యలూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ గత రెండేళ్లలో నాలుగు హత్యలు జరిగినా పోలీసులు వాటిని ఛేదించలేకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. దొంగతనాలకు వచ్చిన వారు హత్యలు కూడా చేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సామర్లకోట చంద్రశేఖరస్వామి ఆలయం సమీపంలో బుధవారం కంచర్ల వడ్డికాసులు అనే వివాహిత హత్య జరగడంతో స్థానిక ప్రజలు ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. పోలీసులకు హత్యలు చాలెంజ్‌గా మారాయి. 2013 సెప్టెంబరు 21న ప్రముఖ దేవాలయమైన శ్రీమాండవ్యనారాయణస్వామి ఆలయంలో నైట్ వాచ్‌మన్ కాదా వీరభద్రరావును దొంగలు హత్య చేసి ఆలయంలో హుండీ పగలు కొట్టారు. ఆ కేసులో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. 2014 మే 18న మండల పరిధిలో వేట్లపాలెం గ్రామంలో కాళ్ల భాగ్యలక్ష్మి (56), మనవడు మణికంఠ(10) ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆ కేసు కూడా ముందుకు సాగలేదు. తాజాగా బుధవారం వివాహిత హత్య జరిగింది. ఈ హత్య కేసును ఎలాగైనా ఛేదించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే పట్టణ నడిబొడ్డు మఠం సెంటర్లోని ఆంధ్రాబ్యాంకులో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగి సత్యనారాయణను సాయంత్రం సమయంలో హత్య చేసి మూడేళ్లు గడిచి పోయింది. ఆ కేసు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. ఈ కేసుల విషయంలో హోం మంత్రి చొరవ తీసుకుని పోలీసులు నిందితులను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కరుడుగట్టిన నేరస్తుడి పనే స్థానిక చంద్రశేఖరస్వామి ఆలయం వద్ద జరిగిన వివాహిత హత్యను కరుడుకట్టిన నేరస్తుడే చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న నగదు, నగలు దోచుకు పోవడానికి యత్నించాడని, బీరువా తాళాలు ఎక్కడ ఉన్నది చెప్పకపోవడంతో కంఠాన్ని కత్తితో కోశాడని ఎస్సై ఆకుల శ్రీనివాసు భావిస్తున్నారు. చిన్న గదిలో ఉన్న బీరువాలో ఏమీ లభించకపోవ డంతో ఆమె శరీరంపై ఉన్న నగలు తీసుకుని పోయి ఉంటాడని చెబుతున్నారు. మొదట చేతిపై గాయపర్చి బెదిరించి ఉంటాడని, ఆమె బెదరక పోవడంతో హత్య చేశాడని అనుమానిస్తున్నారు. ఏదేమైనా నిందితులను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.