తీపి... చేదు మిశ్రమాల ఉగాది
2012లో రిలీజైన పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అందుకే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాదికి సందడి చేయడానికి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తెర మీదకొచ్చాడు. సినిమా మొత్తం ఆటాపాటలతో సందడి సందడిగానే సాగింది. కానీ, పవన్ నుంచి ఇంకా భారీగా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆ భారీ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. దాంతో చేదు అనుభవమే మిగిలింది. దాదాపు 75 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు 50 కోట్లు రాబట్టగలిగింది.
ఆ తర్వాత వారం గ్యాప్‌తో మంచు విష్ణు, రాజ్ తరుణ్ ‘ఈడో రకం ఆడో రకం’ రిలీజైంది. మంచి ఎంటర్‌టైనర్ అనిపించుకుని, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్‌గా నిలబడింది. అనంతరం వారం రోజులకు అల్లు అర్జున్ ‘సరైనోడు’వచ్చాడు. టైటిల్‌కి తగ్గట్టే వసూళ్ల పరంగా ‘సరైనోడు’ అనిపించుకున్నాడు. సుమారు రూ.50 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.90 కోట్ల్ల వరకూ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్‌లో హయ్యస్ట్ గ్రాసర్ ఇది.