బుల్లితెరపై పవర్స్టార్..? | Pawan kalyan entry into small screen | Sakshi
Sakshi News home page

బుల్లితెరపై పవర్స్టార్..?

Published Fri, Jan 8 2016 9:46 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

బుల్లితెరపై పవర్స్టార్..? - Sakshi

బుల్లితెరపై పవర్స్టార్..?

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడా..? పెద్దగా పబ్లిక్ ఫంక్షన్లకు హాజరుకాని పవన్, ఓ టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడా..? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్ త్వరలోనే ఓ టీవీ షోకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ షో కూడా పవన్ వ్యవహార శైలికి తగ్గట్టుగా రూపొందించేందుకు కసరత్తులు మొదలయ్యాయట.

అమీర్ ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సత్యమేవ జయతే జాతీయస్థాయిలో ఘనవిజయం సాధించింది. హిందీలో తెరకెక్కిన ఈ షోను తరువాత పలు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేశారు. ఇప్పుడు ఇదే తరహా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడానికి పవన్ అంగీకరించాడనే టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసే పనుల్లో ఉంది. ప్రస్తుతం పవన్, సర్దార్ గబ్బర్సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా రిలీజ్కు రెడీ అవుతున్న ఈ సినిమా పూర్తయిన తరువాత పవన్ టీవీ షోపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement