సినిమాకు వెళ్తే వేలు తెగిపోయింది! | If the film has been broken finger! | Sakshi
Sakshi News home page

సినిమాకు వెళ్తే వేలు తెగిపోయింది!

Published Sat, Apr 9 2016 12:31 AM | Last Updated on Fri, Mar 22 2019 5:29 PM

సినిమాకు వెళ్తే   వేలు తెగిపోయింది! - Sakshi

సినిమాకు వెళ్తే వేలు తెగిపోయింది!

ఎల్‌బీనగర్: సినిమా టికెట్ల కోసం వెళ్తే చేతి వేలు తెగిపోయింది.  వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది.  వివరాలు... శుక్రవారం విడుదలైన పవన్‌కల్యాణ్ సినిమా సర్ధార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు విష్ణు థియేటర్ వద్దకు వచ్చారు. 

 
టికెట్లు తీసుకుందామనే ఆతృతతో కొందరు సినిమా థియేటర్ మెయిన్ గేటు ఎక్కి లోనికి దూకారు. అదే సమయంలో వాచ్‌మన్ ఒక్కసారిగా గేటును తెరిచాడు. అప్పటికే గేటుపై ఉన్న గుర్తు తెలియని యువకుడు కిందికి దూకడంతో గేటుకు ఉన్న ఇనుప చువ్వలకు చేతి వేలు తెగి కిందపడిపోయింది. చేతి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సరదాగా సినిమా చూడటానికి వచ్చిన యువకుడి వేలు తెలిపోవడంతో తోటి ప్రేక్షకులను కలచివేసింది. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈఘటన జరిగిందని పలువురు ఆరోపించారు. మెయిన్ గేటు తెరిచి ఉంచాల్సిన థియేటర్ యజమాన్యం సినిమా మొదలయ్యే సమయం అవుతున్నా మూసి ఉంచడంతోనే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement