Sardar Gabbarsing
-
తీపి... చేదు మిశ్రమాల ఉగాది
2012లో రిలీజైన పవన్ కల్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. అందుకే ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉగాదికి సందడి చేయడానికి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తెర మీదకొచ్చాడు. సినిమా మొత్తం ఆటాపాటలతో సందడి సందడిగానే సాగింది. కానీ, పవన్ నుంచి ఇంకా భారీగా ఎక్స్పెక్ట్ చేశారు. ఆ భారీ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. దాంతో చేదు అనుభవమే మిగిలింది. దాదాపు 75 కోట్లతో తీసిన ఈ సినిమా సుమారు 50 కోట్లు రాబట్టగలిగింది. ఆ తర్వాత వారం గ్యాప్‌తో మంచు విష్ణు, రాజ్ తరుణ్ ‘ఈడో రకం ఆడో రకం’ రిలీజైంది. మంచి ఎంటర్టైనర్ అనిపించుకుని, ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్‌గా నిలబడింది. అనంతరం వారం రోజులకు అల్లు అర్జున్ ‘సరైనోడు’వచ్చాడు. టైటిల్‌కి తగ్గట్టే వసూళ్ల పరంగా ‘సరైనోడు’ అనిపించుకున్నాడు. సుమారు రూ.50 కోట్లతో తీసిన ఈ సినిమా రూ.90 కోట్ల్ల వరకూ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ ఇది. -
కోమాలో గుంటూరు వాసి.. పరిస్థితి విషమం
సాక్షి, గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుంటూరుకు చెందిన మారెళ్ల జయభారత్‌రెడ్డి (24) పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో భరత్‌కు ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న భరత్ శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ రోజు మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి చెప్పారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివాసముంటున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతులకు జయభారత్‌రెడ్డి మూడో కుమారుడు. తమ కుమారుడి కోసం అమెరికా వెళ్లేందుకు సహాయం చేయాలని భరత్ రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్‌ను కోరారు. కాగా, కోమాలోకి వెళ్లిన భరత్ చికిత్స కోసం స్నేహితులు విరాళాలు సేకరిస్తున్నారు. -
టెక్సాస్‌లో గుంటూరు యువకుడికి ప్రమాదం
సాక్షి, గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన మారెళ్ల జయభారత్‌రెడ్డి (24) తీవ్రంగా గాయపడ్డారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివశిస్తున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతుల మూడో కుమారుడు జయభారత్‌రెడ్డి టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. జయభారత్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో గదికి వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి చెప్పారు. శస్త్రచికిత్స చేసిన తరువాత అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని తెలిపారు. అమెరికా వెళ్లేందుకు తమకు సహాయం చేయాలని ఎంపీ రాయపాటి సాంబశివరావును, కలెక్టర్‌ను కోరనున్నట్లు చెప్పారు. -
సినిమాకు వెళ్తే వేలు తెగిపోయింది!
ఎల్బీనగర్: సినిమా టికెట్ల కోసం వెళ్తే చేతి వేలు తెగిపోయింది. వనస్థలిపురం విష్ణు థియేటర్ వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. వివరాలు... శుక్రవారం విడుదలైన పవన్‌కల్యాణ్ సినిమా సర్ధార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యలో యువకులు విష్ణు థియేటర్ వద్దకు వచ్చారు. టికెట్లు తీసుకుందామనే ఆతృతతో కొందరు సినిమా థియేటర్ మెయిన్ గేటు ఎక్కి లోనికి దూకారు. అదే సమయంలో వాచ్‌మన్ ఒక్కసారిగా గేటును తెరిచాడు. అప్పటికే గేటుపై ఉన్న గుర్తు తెలియని యువకుడు కిందికి దూకడంతో గేటుకు ఉన్న ఇనుప చువ్వలకు చేతి వేలు తెగి కిందపడిపోయింది. చేతి నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. సరదాగా సినిమా చూడటానికి వచ్చిన యువకుడి వేలు తెలిపోవడంతో తోటి ప్రేక్షకులను కలచివేసింది. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈఘటన జరిగిందని పలువురు ఆరోపించారు. మెయిన్ గేటు తెరిచి ఉంచాల్సిన థియేటర్ యజమాన్యం సినిమా మొదలయ్యే సమయం అవుతున్నా మూసి ఉంచడంతోనే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
అభిమానులూ... నా మాట వినండి!
‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో ఫంక్షన్ చేయాలా, వద్దా అనే సందిగ్ధంలో నిన్నటి వరకూ ఉన్నాం. మామూలుగా అయితే పాటలను ఓ ప్రెస్ మీట్ పెట్టి విడుదల చేసేద్దామనుకున్నాం’’ అని హీరో పవన్‌కల్యాణ్ అన్నారు. పవన్‌కల్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా బాబీ దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం నాడు హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ ఆడియో వేడుకకు పాస్‌లు ఉన్నవాళ్లే రావాలని కోరుతున్నానని చెప్పారు. ఆయన మాట్లాడుతూ- ‘‘నేను బయట అభిమానుల సమక్షంలో ఫంక్షన్లు నిర్వహించుకునే సంస్కృతికి బద్ధవ్యతి రేకిని. కానీ సినీ వ్యాపార విధానాలకు నేనూ లొంగక తప్పలేదు. ఈ ఆడియో ఫంక్షన్ నోవాటల్లో చేస్తామని పోలీస్ పర్మిషన్ అడిగినప్పుడు భద్రతాపరమైన సమస్యలున్నాయ న్నారు. మొదట నిజామ్ గ్రౌండ్స్‌లో చేద్దామనుకున్నాం. కానీ పోలీసులు అక్కడా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారు. సినీ ఫంక్షన్‌గా మొదలై తర్వాత ఏ రూపం దాలుస్తుందోనని భయమేసింది. అందుకే నోవాటెల్‌లోనే చేస్తున్నాం. నిర్మాత శరత్ మరార్ నోవాటెల్‌లోని విదేశీ ప్రతినిధులకు ఇబ్బంది కలగకుండా తీసుకున్న భద్రతా చర్యలను పోలీసులకు వివరించి, అనుమతి పొందారు. అందుకే, పాస్‌లు ఉన్నవాళ్లే రావాలని ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. లేనివాళ్లు దయచేసి అక్కడ గూమిగూడవద్దని కోరుతున్నా’’ అన్నారు. ‘‘అభిమానులతో పాటు అసాంఘిక శక్తులు కూడా ఫంక్షన్‌కి వచ్చే అవకాశం ఉంది. అందుకే పాస్‌లు ఉన్నవాళ్ళే తప్ప, మిగిలినవారు రావద్దని ఫ్యాన్స్‌కు ప్రేమతో చెబుతున్నా. వాళ్లు కచ్చితంగా వింటారనుకుంటున్నా’’ అని పవన్‌కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్.కూ, మంత్రులు హరీశ్‌రావు, కె.టి.ఆర్ల సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుకకు చిరంజీవి అతిథిగా రానుండడం గురించి ప్రస్తావిస్తూ, ‘‘గతంలో ‘గబ్బర్‌సింగ్’ ఆడియో వేడుకకు కూడా అన్నయ్య చిరం జీవి వచ్చారు. ‘జానీ’ తర్వాత నేను కథ-స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం కావడంతో మళ్లీ అన్నయ్యను ఈ వేడుకకు అతిథిగా పిలిచా’’ అన్నారు. ‘‘ఈ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అంతా ఖమ్మం-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరుగుతుంది. దానికి కాస్త హిందీ టచ్ ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని ఈరోస్ వాళ్లు డబ్బింగ్ చేస్తామని ముందుకు వచ్చారు. ఈ హిందీ వెర్షన్లో నేను ఏ పాటా పాడలేదు. నా పాత్రకు డబ్బింగ్ కూడా చెప్పలేదు’’ అని పవన్ వివరించారు. సినిమాల నుంచి తప్పుకుంటారని వస్తున్న వార్తలకు స్పందిస్తూ- ‘‘ ‘ఖుషి’ తర్వాత నాలుగు హిట్స్ వస్తే సినిమాలు మానేద్దామనుకున్నా. ఇప్పుడైతే నాకా ఉద్దేశం లేదు’’ అని వివరణ ఇచ్చారు. -
బుల్లితెరపై పవర్‌స్టార్..?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడా..? పెద్దగా పబ్లిక్ ఫంక్షన్లకు హాజరుకాని పవన్, ఓ టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడా..? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్ త్వరలోనే ఓ టీవీ షోకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ షో కూడా పవన్ వ్యవహార శైలికి తగ్గట్టుగా రూపొందించేందుకు కసరత్తులు మొదలయ్యాయట. అమీర్ ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సత్యమేవ జయతే జాతీయస్థాయిలో ఘనవిజయం సాధించింది. హిందీలో తెరకెక్కిన ఈ షోను తరువాత పలు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేశారు. ఇప్పుడు ఇదే తరహా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడానికి పవన్ అంగీకరించాడనే టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసే పనుల్లో ఉంది. ప్రస్తుతం పవన్, సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా పూర్తయిన తరువాత పవన్ టీవీ షోపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.