కోమాలో గుంటూరు వాసి.. పరిస్థితి విషమం | Guntur resident goes coma, his condition is critical | Sakshi
Sakshi News home page

కోమాలో గుంటూరు వాసి.. పరిస్థితి విషమం

Published Mon, Apr 11 2016 10:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

కోమాలో గుంటూరు వాసి.. పరిస్థితి విషమం

కోమాలో గుంటూరు వాసి.. పరిస్థితి విషమం

సాక్షి, గుంటూరు: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గుంటూరుకు చెందిన మారెళ్ల జయభారత్‌రెడ్డి (24) పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. దాంతో భరత్కు ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న భరత్ శనివారం రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.

ఆ రోజు మధ్యాహ్నం సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా చూసి కారులో వెళుతుండగా వేగంగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు కాగా, జయభారత్‌రెడ్డి తీవ్రగాయాలతో కోమాలోకి వెళ్లినట్లు తండ్రి సాంబశివారెడ్డి చెప్పారు. గుంటూరు వెంకటరమణ కాలనీ 3వ లైనులో నివాసముంటున్న మారెళ్ల సాంబశివారెడ్డి, సరోజనీదేవి దంపతులకు జయభారత్‌రెడ్డి మూడో కుమారుడు. తమ కుమారుడి కోసం అమెరికా వెళ్లేందుకు సహాయం చేయాలని భరత్ రెడ్డి తండ్రి సాంబశివారెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ను కోరారు. కాగా, కోమాలోకి వెళ్లిన భరత్ చికిత్స కోసం స్నేహితులు విరాళాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement