small screen
-
వెండితెర, బుల్లితెర తారలకు అవార్డులు..
చెన్నై సినిమా: డితెర, బుల్లితెర తారల అవార్డుల వేడుక ఆదివారం చెన్నైలోని స్థానిక వడపళనిలోని శిఖరం హాల్లో జరిగింది. మహా ఆర్ట్స్ డా. అనురాధ జయరాం, యునైటెడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఇండియా కలైమామని డాక్టర్ నెల్లై సుందరరాజన్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు చెన్నై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎస్కే కృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నటుడు గుహన్ చక్రవర్తి, వయ్యాపురి, బుల్లితెర నటుడు పాండికమల్, విఘ్నేష్, శ్యామ్, సాయి శక్తి, నటి హన్సాదీపన్, స్మాలిన్ మోనిక, నిరంజన్, మిస్ తమిళనాడు శాంత సౌర్భన్, హరితకు అవార్డులు అందజేశారు. చదవండి:👇 చిత్రపరిశ్రమలో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం హీరో విశాల్‌కు మరోసారి గాయాలు.. షూటింగ్ నిలిపివేత.. బాధాకరమైన పెళ్లిళ్లకు మీరే కారణం.. సమంత కామెంట్స్ వైరల్ వేశ్య పాత్రలో యాంకర్ అనసూయ..! -
సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ఆమని
సీనియర్ నటి, ఒకనాటి టాప్ హీరోయిన్ ఆమని చిన్నితెరపై దర్శనమివ్వనున్నారు. తొలిసారిగా ఆమె నటించిన తెలుగు సీరియల్ జీ తెలుగులో శనివారం (ఆగస్టు 21,2021) నుంచి ప్రసారం కానుంది. అదే విధంగా ఉప్పెన ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన కృతి శెట్టి తొలిసారిగా ఈ సీరియల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండడం మరో విశేషం. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ... తొలిసారిగా తెలుగు చిన్నితెరకు పరిచయం అవుతున్నందుకు, కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వినూత్న కధాంశంతో తెరకెక్కిన ఈ సీరియల్లో కధానాయిక పాత్ర కీలకం. సంప్రదాయాలకు విలువనిచ్చే నవతరం యువతి ఆలోచనల నేపధ్యంలో ఈ సీరియల్ సాగుతుందని రూపకర్తలు తెలిపారు. పెళ్లయ్యాక తనతో పాటు మెట్టినింటికి తల్లీదండ్రులను కూడా తీసుకెళ్లాలని ఆశించే గీత పాత్రలో నటి నిషామిలన్ కనిపిస్తారు. ఈ సీరియల్ రాత్రి 7.30గంటలకు ప్రసారం అవుతుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. చదవండి : 'డైరెక్టర్ కంటే డిజైనర్‌గానే ఎక్కువ సంపాదించా' చిరు బర్త్‌డే : స్పెషల్ సాంగ్‌తో చాటుకున్న అభిమానం -
బుల్లితెరపై విజయ్‌సేతుపతి.. టెలికాస్ట్ ఎప్పుడంటే..
కొరుక్కుపేట: విజయ్‌సేతుపతి బుల్లితెరపైనా అలరించేందుకు సిద్ధమయ్యారు. సన్‌టీవీలో ఆగస్టు 7 నుంచి వారాంతపు రోజుల్లో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ తమిళ్ అంతర్జాతీయ పాక ప్రదర్శన షోకు విజయ్‌సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ వ్యవస్థాపకుడు శరవణప్రసాద్ మాట్లాడుతూ మాస్టర్ చెఫ్ తమిళాన్ని ప్రారంభించడం, విజయ్‌సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. -
బుల్లితెరకు రానా?
తెర చిన్నదే అయినా ప్రేక్షకుల్లో టీవీకి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. ఇంట్లో ఉన్న అందర్నీ తనవైపు లాగేసుకుంటుంది. సిల్కర్ స్క్రీన్‌తో పోల్చితే స్మాల్ స్క్రీన్‌కే ప్రేక్షకులు ఎక్కువ. పైగా సినిమా స్టార్లు కూడా షోలు చేస్తుండటంతో రోజు రోజుకీ క్రేజ్ పెరిగిపోతోంది. ఇప్పటికే మన టాలీవుడ్ స్టార్లు చాలామంది చాలా షోల్లో కనిపించారు. చిన్న ఎన్టీఆర్ హోస్ట్‌గా త్వరలో ‘బిగ్ బాస్’ ప్రసారం కానుంది. ఇప్పుడు చిన్ని తెరపై పెద్ద తెర స్టార్ల జాబితాలో రానా పేరు వినిపిస్తోంది. ఇటీవల రానా ఓ టీవీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. రెండు నెలల తర్వాత ఓ తెలుగు ఛానెల్ ప్రైమ్ టైమ్‌లో ఈ షో ప్రసారం కానుందని భోగట్టా. రానాతో కొన్ని ఎపిసోడ్స్‌ను షూట్ చేసిన తర్వాత అధికారికంగా ఈ షో గురించి నిర్వాహకులు బయటపెట్టాలనుకుంటున్నారట. -
బుల్లితెరపై పవర్‌స్టార్..?
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మరో సంచలనానికి రెడీ అవుతున్నాడా..? పెద్దగా పబ్లిక్ ఫంక్షన్లకు హాజరుకాని పవన్, ఓ టీవీ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడా..? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పవన్ త్వరలోనే ఓ టీవీ షోకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ షో కూడా పవన్ వ్యవహార శైలికి తగ్గట్టుగా రూపొందించేందుకు కసరత్తులు మొదలయ్యాయట. అమీర్ ఖాన్ వ్యాఖ్యతగా వ్యవహరించిన సత్యమేవ జయతే జాతీయస్థాయిలో ఘనవిజయం సాధించింది. హిందీలో తెరకెక్కిన ఈ షోను తరువాత పలు ప్రాంతీయ భాషల్లో కూడా ప్రసారం చేశారు. ఇప్పుడు ఇదే తరహా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించాడానికి పవన్ అంగీకరించాడనే టాక్ వినిపిస్తోంది. ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసే పనుల్లో ఉంది. ప్రస్తుతం పవన్, సర్దార్ గబ్బర్‌సింగ్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వేసవి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా పూర్తయిన తరువాత పవన్ టీవీ షోపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
బుల్లితెరపై బెంద్రే తొలి సంతకం!
టీవీక్షణం: మన్మథుడికి తగిన జోడీగా, శంకర్‌దాదాలో ప్రేమ పుట్టించిన పడతిగా, ఇంద్ర మనసును గెలిచిన మగువగా అలరించింది సోనాలీ బెంద్రే. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన ఆమె... ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తెరమీద కనిపించడానికి సిద్ధమైంది. అది కూడా ఒక సీరియల్‌తో. లైఫ్ ఓకే చానెల్లో ‘అజీబ్ దాస్తా హై యే’తో బుల్లితెర మీద తన తొలి సంతకం చేసింది సోనాలీ. భర్త, అత్తగారు, ఆడపడుచులు, ఇద్దరు పిల్లలు... వీళ్లు తప్ప వేరే ప్రపంచమే ఉండదు శోభకు. అయితే ఉన్నట్టుండి ఆమె జీవితంలో తుఫాను రేగుతుంది. రాజకీయ నాయకుడైన శోభ భర్త ఓ సెక్స్ స్కాండల్‌లో ఇరుక్కుని జైలు పాలవుతాడు. అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొంటాడు. అతడిని కాపాడాలనుకున్న శోభకి నమ్మలేని నిజాలు తెలుస్తాయి. తనను మోసగించి భర్త ఎందరు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడో తెలిసి తట్టుకోలేకపోతుంది. ఓ పక్క ఆ బాధ, మరోపక్క భర్త చేసిన పనికి ఎదుర్కొంటోన్న అవమానాలు, ఇంకోపక్క బ్యాంకులు తమ అకౌంట్లన్నీ సీజ్ చేసేయడంతో తలెత్తిన ఆర్థిక ఇబ్బందులు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దాంతో కుటుంబ పోషణ కోసం ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది. వ్యాపారవేత్త అయిన హీరో దగ్గర పీఏగా చేరుతుంది. అయితే మితిమీరిన ప్రాక్టికల్ పర్సన్ అయిన అతడిని డీల్ చేయడం ఆమెకు కష్టమవుతుంది. అతడి వల్ల ఆమెకెలాంటి ఇబ్బందులొచ్చాయి, వాటినెలా అధిగమించింది, అతడితో ఆమెకెలాంటి బంధం ఏర్పడింది అనేది కథ! మొదట సాధారణ ఇల్లాలిగా అమాయకంగా కనిపించిన సోనాలీ... తర్వాత ఆత్మవిశ్వాసం ఉట్టిపడే మగువగా అద్భుతంగా నటిస్తోంది. తన హుందాతనంతో శోభ పాత్రకు ప్రాణం పోస్తోందామె. అలాగే మూర్ఖత్వం, మొండితనం, కాస్త మంచితనం కలగలసిన వ్యక్తిగా అపూర్వ అగ్నిహోత్రి అభినయానికి కూడా ఫుల్ మార్కులు వేయవచ్చు. ప్రతి హిట్ సీరియల్ తెలుగులోకి డబ్ అవుతున్నట్టు ఇది కూడా అయితే, తెలుగువారికి మరో మంచి సీరియల్ చూసే అవకాశం దొరుకుతుంది! -
35 ఏళ్ల వయసులో తాత పాత్రలా?
ముంబై: ఒక టీవీ నటుడికి ప్రయోగాలు చేసే ఆస్కారం తక్కువగా ఉంటుందన్నాడు బుల్లితెర నటుడు హర్షా చాయా. నేడు టీవీ షోలు అంతంగా ఆకట్టుకోవడం లేదన్నాడు. 'స్వాభిమాన్'టెలివిజన్ షోతో మంచి పేరు తెచ్చుకున్న ఈ నటుడు తండ్రి పాత్రలు చేయడమంటే బోర్ అంటున్నాడు. అసలు 30 ఏళ్లకే తండ్రి పాత్రలేంటని ప్రశ్నిస్తున్నాడు. ప్రస్తుతం తాను ఆ తరహా ఆఫర్లకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశాడు. ఇప్పుడు 30 ఏళ్లు దాటితే తండ్రి పాత్రలు.. 35 ఏళ్లు పైబడితే తాత పాత్రలు అంటున్నారు అంటూ బుల్లితెరపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. తాను ఆర్టిస్ట్ గా ప్రధానం ఉన్న పాత్రలనే చేస్తున్నానని తెలిపాడు. త్వరలో 'బాలికా వధు' సీరియల్ లో పెయింటర్ గా దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నాడు. అంతకుముందు ఈ సీరియల్ లో ఓ లవర్ బాయ్ గా పాత్ర చేసానన్నాడు. అయితే పెయింటర్ గా తాను చేసేది చిన్న క్యారెక్టరే అయినా.. అది ప్రాధాన్యత ఉన్న పాత్ర అని పేర్కొన్నాడు. -
'బుల్లితెరకు గుడ్ బై చెప్పే ప్రసక్తే లేదు'
న్యూఢిల్లీ: మూడు సంవత్సరాల తరువాత మళ్లీ బుల్లి తెరపై కన్పించడానికి సిద్ధమవుతున్నాడు టీవీ, సినీ నటుడు కరణ్ కుంద్రా. తనను ఈ స్థాయికి తెచ్చిన బుల్లితెరకు పుల్ స్టాప్ పెట్టే యోచనే లేదంటున్నాడు. నిరంతరం షూటింగ్ లతో బిజీగా ఉండే కరణ్ స్మాల్ స్ర్కీన్ అంటే అత్యంత ఇష్టమన్నాడు. 'నేను ఎప్పటికీ ప్రపంచ టెలివిజన్ ను విడిచిపెట్టను. ఆ టెలివిజన్ షోలతోనే నాకు గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ లో నాకు బ్రేక్ రావడానికి కూడా అదే కారణం'అని స్పష్టం చేశాడు. 'నేను ఒక ప్రయాణికుడ్ని. ఒకచోట ఉండను. నేను కేవలం ముంబైకి మాత్రమే పరిమితం కాదు.నెలలోని ముప్ఫై రోజులూ షూటింగ్ లోనే ఉంటాను'అని తెలిపాడు. ఇందుకోసం తాను ఉదయం 7 గం.లకు లేచి షూటింగ్ కోసం ముంబైను ఆనుకుని ఉన్న బయటప్రాంతాలకు వెళుతుంటానన్నాడు. అక్కడ షూటింగ్ కు పెద్ద ఖర్చు కాదన్నాడు. తనకు షూటింగ్ అనేది రోజు వారీ కార్యక్రమం అని తెలిపాడు. ప్రతీ రోజూ 15 గంటలపాటు షూటింగ్ లోనే ఉంటానన్నాడు. హారర్ మూవీలు, టీవీ సీరియల్స్ తీసే విక్రమ్ భట్.. ‘హారర్ స్టోరీ’, ‘ఆహట్’ వంటివాటిలో కరణ్ కుంద్రా నటించాడు. ప్రస్తుతం 'కితనీ మొహబ్బత్ హై' లో నటించేందుకు సిద్ధమైయ్యాడు.