
సీనియర్ నటి, ఒకనాటి టాప్ హీరోయిన్ ఆమని చిన్నితెరపై దర్శనమివ్వనున్నారు. తొలిసారిగా ఆమె నటించిన తెలుగు సీరియల్ జీ తెలుగులో శనివారం (ఆగస్టు 21,2021) నుంచి ప్రసారం కానుంది. అదే విధంగా ఉప్పెన ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన కృతి శెట్టి తొలిసారిగా ఈ సీరియల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండడం మరో విశేషం. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ... తొలిసారిగా తెలుగు చిన్నితెరకు పరిచయం అవుతున్నందుకు, కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.
వినూత్న కధాంశంతో తెరకెక్కిన ఈ సీరియల్‌లో కధానాయిక పాత్ర కీలకం. సంప్రదాయాలకు విలువనిచ్చే నవతరం యువతి ఆలోచనల నేపధ్యంలో ఈ సీరియల్ సాగుతుందని రూపకర్తలు తెలిపారు. పెళ్లయ్యాక తనతో పాటు మెట్టినింటికి తల్లీదండ్రులను కూడా తీసుకెళ్లాలని ఆశించే గీత పాత్రలో నటి నిషామిలన్ కనిపిస్తారు. ఈ సీరియల్ రాత్రి 7.30గంటలకు ప్రసారం అవుతుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు.
చదవండి : 'డైరెక్టర్ కంటే డిజైనర్‌గానే ఎక్కువ సంపాదించా'
చిరు బర్త్‌డే : స్పెషల్ సాంగ్‌తో చాటుకున్న అభిమానం
Comments
Please login to add a commentAdd a comment