
కొరుక్కుపేట: విజయ్‌సేతుపతి బుల్లితెరపైనా అలరించేందుకు సిద్ధమయ్యారు. సన్‌టీవీలో ఆగస్టు 7 నుంచి వారాంతపు రోజుల్లో ప్రసారం కానున్న మాస్టర్ చెఫ్ తమిళ్ అంతర్జాతీయ పాక ప్రదర్శన షోకు విజయ్‌సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ వ్యవస్థాపకుడు శరవణప్రసాద్ మాట్లాడుతూ మాస్టర్ చెఫ్ తమిళాన్ని ప్రారంభించడం, విజయ్‌సేతుపతి హోస్ట్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు.