Vijay Sethupathi Is Gentleman Says Actress Sai Rohini - Sakshi
Sakshi News home page

విజయ్‌ సేతుపతి ఓ జెంటిల్మెన్‌.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు

Published Tue, Apr 11 2023 9:00 AM | Last Updated on Tue, Apr 11 2023 9:52 AM

Vijay Sethupathi Is Gentleman Says Actress Sai Rohini - Sakshi

తమిళ సినిమా: విజయ్‌ సేతుపతి ఓ జెంటిల్మెన్‌ అని నటి సాయి రోహిణి పేర్కొంది. వేలూరుకు చెందిన అచ్చ తమిళ అమ్మాయి ఈ చిన్నది. తల్లిదండ్రులు కోరిక మేరకు చదువుకోవడానికి చైన్నెకి వచ్చిన సాయి రోహిణి చదువు పూర్తయిన తర్వాత తన దృష్టిని సినిమాలపై సారించింది. నటిని కావాలన్నది తన డ్రీమ్‌ అని పేర్కొంది. దాన్ని శక్తి వంచన లేకుండా ప్రయత్నించి సాధించగలననే నమ్మకంతో నటీమణులు కావాలనే ప్రకటనలను చూసి ప్రతి ఆడిషన్‌ను వదలకుండా పాల్గొనేదాన్నని చెప్పింది.

అలా లభించిన అవకాశమే నాట్‌ రీచ్చబుల్‌ చిత్రం అని తెలిపింది. ఆ తర్వాత మిడిల్‌ క్లాస్‌ అనే చిత్రంలో నటించినట్లు చెప్పింది. ప్రస్తుతం దుచ్చాదనన్‌ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తున్నట్లు చెప్పింది. ఈ చిత్ర షూటింగ్‌ గోపిశెట్టి పాలెం, ఈరోడ్‌ ప్రాంతాల్లో జరుపుకుంటోందని తెలిపింది. కాగా నటుడు సూరికి జంటగా హాట్‌ స్టార్‌ ఓటీటీ కోసం నిర్మాత అరుణ్‌ నిర్మిస్తున్న చిత్రంలో కథానాయకిగా నటించనున్నట్లు చెప్పింది. దీనికి వెట్రివీరన్‌ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపింది. వీరితోపాటు మరో రెండు తెలుగు చిత్రాలకు కమిట్‌ అయినట్లు చెప్పింది.

కాగా విజయ్‌ సేతుపతి నేతృత్వంలో 2023 క్యాలెండర్‌ రూపొందించిన విషయం తెలిసిందే అన్నారు. అందులో నెలకొకటి చొప్పున 12 పేజీలను రూపొందించినట్లు అందులో రెండు పేజీల కోసం తాను విజయ్‌ సేతుపతి కలిసి నటించినట్లు చెప్పింది. అందుకోసం షూటింగ్‌ ఒకరోజు నిర్వహించినా అందులో విజయ్‌ సేతుపతితో కలిసి నటించిన అనుభవం మరువలేనిదని పేర్కొంది. ఆయన ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా మర్యాదగా చూసుకున్నారని చెప్పింది. ఆ క్యాలెండర్‌ కోసం నటించిన వారిలో ఏకై క నటిని తానేనని సాయి రోహిణి చెప్పింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement