మోహన్‌బాబు అల్లరి..! | Separate rute as an actor Mohan Babu | Sakshi
Sakshi News home page

మోహన్‌బాబు అల్లరి..!

Published Sat, Jun 27 2015 11:46 PM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

మోహన్‌బాబు అల్లరి..!

మోహన్‌బాబు అల్లరి..!

నటుడిగా మోహన్‌బాబు రూటే సెపరేట్. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.

నటుడిగా మోహన్‌బాబు రూటే సెపరేట్. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఇక, ఈ తరం కథానాయకుల్లో హాస్యాన్ని నమ్ముకుని, విజయవంతంగా దూసుకుపోతున్నారు ‘అల్లరి’ నరేశ్. కామెడీ చిత్రాలను తెరకెక్కించ డంలో దర్శకుడు శ్రీనివాసరెడ్డి దిట్ట.
 
 ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే... అది కచ్చితంగా ఆసక్తికరమే. అలాగే, ఇది పూర్తి స్థాయి వినోదంతో రూపొందుతుందని ఎవరైనా ఇట్టే ఊహిస్తారు.
 
 మోహన్‌బాబు, నరేశ్ ముఖ్య తారలుగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఓ చిత్రం నిర్మించనున్నారు. ఇది ఓ మరాఠీ సినిమాకి రీమేక్. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement