పంచ్ పాండవులు | 'Pandavulu Pandavulu Tummeda' ready for a big release | Sakshi
Sakshi News home page

పంచ్ పాండవులు

Published Sun, Jan 26 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 AM

పంచ్ పాండవులు

పంచ్ పాండవులు

బొక్కా లంబోదరం ఉరఫ్ లంబోరా..
 తల్లీ చెల్లీ ఏ గల్లీలో లేని సిల్లీ నా కొడుకుని..
 అరిస్తే కరుస్తా.. కరిస్తే చరుస్తా... 
 
 ది రిలేషన్‌షిప్ బిట్వీన్ టు పర్సన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్. 
 బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఎ ఫిషర్‌మేన్..లాంటి డైలాగ్స్‌ని చెప్పడంలో మోహన్‌బాబు స్టయిలే వేరు. ఈ డైలాగులు ఆయన ఎప్పుడో చెప్పినా... ఇప్పటికీ గుర్తుండిపోయాయి. దానికి కారణం ఆ డైలాగ్స్‌ని మోహన్‌బాబు చెప్పిన తీరు అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ పదేళ్లల్లో మోహన్‌బాబు పూర్తి స్థాయి కథానాయకునిగా నటించకపోవడంతో ఇలాంటి పంచ్ డైలాగుల్ని ఆయన నుంచి ప్రేక్షకులు మిస్సయ్యారు.
 
  ‘పాండవులు పాండవులు తుమ్మెద’ ఆ కొరత తీరుస్తుందని విష్ణు, మనోజ్ అంటున్నారు. డా. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ కాంబినేషన్‌లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చిత్రం ఇది. విష్ణు, మనోజ్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ - ‘‘ఇప్పటివరకు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. నా తరహా సెటైరికల్ డైలాగ్స్, మనోజ్ సమకూర్చిన పోరాట దృశ్యాలు, డాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. డా. దాసరి నారాయణరావు చేసిన కీలక పాత్ర మరో ఆకర్షణ అవుతుంది’’ అని చెప్పారు. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత నాయికలుగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement