టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు మంచు మనోజ్ స్పీడు పెంచాడు. తను లీడ్ రోల్లో నటించిన ఎటాక్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి హానీమూన్ ట్రిప్కు వెళ్లిన మనోజ్, ఈ మధ్యే తిరిగి షూటింగ్లకు అటెండ్ అవుతున్నాడు. మనోజ్ ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ఓ సాఫ్ట్ లవ్స్టోరిలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు మంచువారబ్బాయి.
మనోజ్ కెరీర్లోనే బిందాస్ బిగెస్ట్ హిట్. ఈ యంగ్ హీరో ఎనర్జీకి పర్ఫెక్ట్గా సూట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడు మనోజ్. ఇప్పటికే దర్శకుడు వీరుపోట్ల కథ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తుంది. వీరుపోట్లకు కూడా మంచు ఫ్యామిలీతో మంచి ట్రాక్ రికార్డే ఉంది. మనోజ్ తో బిందాస్ తో పాటు విష్ణు హీరోగా దూసుకెళ్తా సినిమాలను తెరకెక్కించిన వీరుపోట్ల మంచి విజయాలు సాదించాడు. అందుకే మరోసారి వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ 2 చేయడానికి రెడీ అవుతున్నాడు మనోజ్.
స్పీడు పెంచిన మనోజ్
Published Sun, Sep 13 2015 1:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM
Advertisement
Advertisement