Veeru Potla
-
వారు వీరు ఓ సినిమా అంట
‘బిందాస్, రగడ’ చిత్రాలతో ప్రేక్షకులకు కావాల్సిన కామెడీ డోస్‌ను రెండింతలు వడ్డించిన దర్శకుడు వీరు పోట్ల. 2016లో వచ్చిన ‘ఈడు గోల్డ్ ఎహే’ తర్వాత వీరు ఏ సినిమా ప్లాన్ చేస్తున్నారో తెలియదు. అయితే లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే.. వెంకటేశ్‌కు ఓ మల్టీస్టారర్ కథను వినిపించినట్లు, ఆయన కూడా ఓకే చెప్పినట్లు టాక్. 14 రీల్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. ఈ మల్టీస్టారర్‌లో మరో హీరోగా ఎవరు నటిస్తారన్నది ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. రవితేజ ఉండొచ్చని, కాదు రానా నటిస్తారని చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆ రెండో హీరో ఎవరో ఫిక్స్ చేసి, ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు వెళ్లే అవకాçశం ఉందట. ఈ చిత్రమే కాకుండా మరో పీరియాడికల్ కథను కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నారట వీరు పోట్ల. వెంకటేశ్‌తో చేయబోయే మల్టీస్టారర్ చిత్రమా లేక పీరియాడికల్ డ్రామానా? ఏది ముందు సెట్స్ మీదకు వెళుతుందో తెలియాలి. ఏది ఏమైనా థియేటర్లో ప్రేక్షకుడిని నవ్విస్తూ సీటులోంచి ముందుకు పడేలా చేయడమో, పీరియాడికల్ మూవీతో కాలంలో వెనక్కు తీసుకెళ్లడమో కన్ఫార్మ్ అనుకోవచ్చు. -
సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహే’
పూలరంగడు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, మిస్టర్ పెళ్ళికొడుకు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన హీరో సునీల్ హీరోగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాతగా వీరు పోట్ల దర్శకత్వంలో నూతన చిత్రం 'ఈడు గోల్డ్ ఎహే' త్వరలోనే ప్రారంభం కానుంది. గతంలో వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ వంటి సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్ ను నిర్మించిన ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రూపొందనునున్న ఈ చిత్రంలో హీరోయిన్ సహా మిగతా నటీనటులు. టెక్నిషియన్స్ వివరాలను త్వరలోనే తెలియజేస్తామని నిర్మాత తెలిపారు. -
స్పీడు పెంచిన మనోజ్
టాలీవుడ్ కొత్త పెళ్లికొడుకు మంచు మనోజ్ స్పీడు పెంచాడు. తను లీడ్ రోల్లో నటించిన ఎటాక్ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో రెండు సినిమాలను రెడీ చేస్తున్నాడు. పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి హానీమూన్ ట్రిప్‌కు వెళ్లిన మనోజ్, ఈ మధ్యే తిరిగి షూటింగ్‌లకు అటెండ్ అవుతున్నాడు. మనోజ్ ప్రస్తుతం దశరథ్ దర్శకత్వంలో ఓ సాఫ్ట్ లవ్‌స్టోరిలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడు మంచువారబ్బాయి. మనోజ్ కెరీర్లోనే బిందాస్ బిగెస్ట్ హిట్. ఈ యంగ్ హీరో ఎనర్జీకి పర్ఫెక్ట్గా సూట్ అయిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వల్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడు మనోజ్. ఇప్పటికే దర్శకుడు వీరుపోట్ల కథ కూడా రెడీ చేశాడన్న టాక్ వినిపిస్తుంది. వీరుపోట్లకు కూడా మంచు ఫ్యామిలీతో మంచి ట్రాక్ రికార్డే ఉంది. మనోజ్ తో బిందాస్ తో పాటు విష్ణు హీరోగా దూసుకెళ్తా సినిమాలను తెరకెక్కించిన వీరుపోట్ల మంచి విజయాలు సాదించాడు. అందుకే మరోసారి వీరుపోట్ల దర్శకత్వంలో బిందాస్ 2 చేయడానికి రెడీ అవుతున్నాడు మనోజ్. -
నృత్యాలూ పోరాటాల విషయంలో చాలా కష్టపడ్డాను - విష్ణు
‘‘ ‘దూసుకెళ్తా’ విడుదలై 9 రోజులైంది. ఇంకా తరగని వసూళ్లతో దూసుకెళుతోందీ సినిమా. అన్ని ప్రాంతాల నుంచీ మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది’’ అని మంచు విష్ణు అన్నారు. ఆయన కథానాయకునిగా వీరు పోట్ల దర్శకత్వంలో డా.మోహన్‌బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవల విడుద లైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేస్తూ... శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ -‘‘ఈ సినిమాలో నా నటన బాగుందని చాలా మంది అభినందించారు. అయితే... నటన విషయంలో నేను ఎప్పుడూ సంతృప్తి చెందను. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నృత్యాలూ పోరాటాల విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాను. అయితే... ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసాలు మాత్రం చేయలేదు. వచ్చేవారం భారీగా విజయోత్సవాన్ని జరుపుతాం’’ అని తెలిపారు. ‘‘ఓ వైపు దసరా సెలవులు అయిపోయాయి. మరో వైపు భారీ వర్షాలు. అయినా ఈ సినిమాకు వసూళ్లు మాత్రం తగ్గలేదు. విష్ణు ఎనర్జిటిక్ యాక్షన్, బ్రహ్మానందం, ‘వెన్నెల’కిషోర్, రఘుబాబుల కామెడీ సన్నివేశాలు ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని వీరు పోట్ల చెప్పారు. ‘ఢీ’ లాంటి మంచి కథ కుదిరితే... తన దర్శకత్వంలో విష్ణుతో ఓ సినిమా చేస్తానని రచయిత గోపిమోహన్ చెప్పారు. -
వీరు పోట్ల దర్శకత్వంలో...
మొన్నటివరకూ మెరుపువేగంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన రవితేజ ఇప్పుడు అచితూచి అడుగేస్తున్నారు. చాలాకాలం తర్వాత ‘బలుపు’తో విజయాన్ని అందుకున్న ఆయన... తర్వాత నటించే సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘బలుపు’ రచయిత బాబీతో రవితేజ ఓ సినిమా చేయనున్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే... ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా రవితేజ కమిట్ అయ్యారట. బిందాస్, రగడ, దూసుకెళ్తా చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వీరు పోట్ల కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ‘ఏ’ టీవీ సమర్పణలో అనిల్ సుంకర నిర్మించనున్నారట. రవితేజ శారీరకభాషకు తగ్గట్టుగా ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌ని వీరు పోట్ల సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని తెలిసింది -
మౌత్‌టాక్ వల్లే ఈ విజయం
‘‘‘దూసుకెళ్తా’ ఇప్పటివరకూ ప్రపంచంలో రాని కొత్త కథ అని నేను చెప్పను. రొటీన్ కథే అయినా కొత్తగా చెప్పడానికి ప్రయత్నించా. ఈ చిత్రానికి లభిస్తున్న ఆదరణ.. పడిన కష్టం మొత్తాన్నీ మరపించింది’’ అని వీరు పోట్ల అన్నారు. ఆయన దర్శకత్వంలో మంచు విష్ణు కథానాయకునిగా డా. మోహన్‌బాబు నిర్మించిన చిత్రం ‘దూసుకెళ్తా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు వీరు పోట్ల. ఆదివారం ఆయన విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఇంకా చెబుతూ- ‘‘ఈ సినిమా విడుదల సమయంలోనే నాకు పాప పుట్టింది. ఆ హడావిడిలో తొలి ఆట చూడలేకపోయాను. తొలి రెండు ఆటలూ వసూళ్ల పరంగా డల్‌గా ఉన్నాయని విన్నాను. కానీ సాయంత్రం నుంచే వసూళ్లు ఊపందుకున్నాయి. పరిచయం లేని వారు కూడా ఫోన్లు చేసి మరీ అభినందిస్తున్నారు. మౌత్ టాక్ వల్లే ఈ విజయం’’ అన్నారు వీరు పోట్ల. ‘‘నిజానికి ఇది మనోజ్ కోసం అనుకున్న కథ. అయితే... మోహన్‌బాబుగారు విష్ణుతో చేస్తే బాగుంటుందన్నారు. దాంతో విష్ణు శారీరకభాషకు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశా. మనోజ్ అంత ఎనర్జిటిగ్గా విష్ణు ఉండడేమో అనుకున్నా.. కానీ మనోజ్‌కి ఏ మాత్రం తీసిపోని రీతిలో నటించాడు విష్ణు. నటునిగా తనను మరో మెట్టు పైన నిలబెట్టిన సినిమా ఇది’’ అని చేశాడు. విష్ణు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, భరత్ పాత్రలకు మంచి అప్లాజ్ వస్తోందని, ప్రథమార్ధం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా రిజల్ట్ ఇంకా బాగుండేదని వీరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మనోజ్ కోసం ‘బిందాస్-2’ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. -
మాస్, క్లాస్ ప్రేక్షకులే లక్ష్యంగా 'దూసుకెళ్తా'!
'దేనికైనా రెఢీ' చిత్రం అందించిన ఉత్సాహంతో వీరు పోట్ల దర్శకత్వంలో లావణ్య త్రిపాఠి (అందాల రాక్షసి ఫేం)తో మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం 'దూసుకెళ్తా'. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాత మోహన్ బాబు. వినోదమే ప్రధాన లక్ష్యంగా రూపొందిన 'దూసుకెళ్తా' అక్టోబర్ 17 తేది గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్, క్లాస్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన 'దూసుకెళ్తా' చిత్రం ప్రేక్షకులను ఏ రేంజ్ లో సంతృప్తి పరిచిందో తెలుసుకుందాం! చిన్నతనం నుంచే బెట్టింగ్ కాయడంలో చిన్నా ఉరఫ్ వెంకటేశ్వరరావు ముందుంటాడు. ఎవరూ ఎలాంటి సహాయం చేసినా మర్చిపోకుండా మేలు చేసే చిన్నా.. జర్నలిస్టు ఉద్యోగం కోసం ఓ టెలివిజన్ ఛానెల్ ను సంప్రదిస్తాడు. కేంద్ర మంత్రి ఢిల్లేశ్వర్ చేసే అవినీతి కార్యక్రమంపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించమని టెలివిజన్ చానెల్ ఓ పని అప్పగిస్తుంది. కేంద్ర మంత్రి అవినీతి భాగోతాన్ని చిన్నా దిగ్విజయం పూర్తి చేస్తాడు. అయితే కేంద్ర మంత్రి అనుచరులు జరిపిన దాడిలో చిన్నా తీవ్రంగా గాయపడుతాడు. గాయపడిన చిన్నాను అలేఖ్య అనే డాక్టర్ కాపాడి.. ఆస్పత్రిలో చేర్పించడమే కాకుండా దగ్గరుండి అపాయం నుంచి గట్టెక్కిస్తుంది. తనకు సహాయం చేసిన అలేఖ్యను కొందరు చంపడానికి ప్రయత్నిస్తున్నారని, ఆమె ప్రమాదంలో ఉందని తెలుసుకున్న చిన్నా.. సహాయం చేసేందుకు వెన్నంటి ఉంటాడు. ఇదిలా ఉండగా తనను కాపాడుతున్న చిన్నా.. చిన్ననాటి స్నేహితుడే అని అలేఖ్య తెలుసుకుంటుంది. తన తండ్రి నుంచి తాను, తన తల్లి దూరం కావడానికి, తమ కష్టాలకు కారణమని చిన్నపై అలేఖ్య ద్వేషాన్ని పెంచుకుంటుంది. అయితే ఓ ప్రమాదం నుంచి అలేఖ్యను కాపాడిన చిన్నాకూడా ఆమె తన చిన్ననాటి స్నేహితురాలేనని తెలుసుకుంటాడు. అంతేకాకుండా తన వల్ల కుటుంబానికి, తండ్రికి దూరమైన అలేఖ్యను అదే కుటుంబంలో సముచిత గౌరవాన్ని అందించడానికి నిర్ణయించుకుంటాడు. అలేఖ్యను చంపాలని ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు? కుటుంబం నుంచి అలేఖ్య దూరం కావడానికి కారణాలేమిటి? తన కుటుంబంలో అలేఖ్యకు సముచిత స్థానం కల్పించడంలో చిన్నా సఫలమయ్యాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'దూసుకెళ్తా' చిత్రం. చిన్నా పాత్రలో మంచు విష్ణు తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించాడు. వినోదం పండించడంలోనూ, ఫైట్స్, డాన్సులను విష్ణు తన మార్కును చూపించాడు. కీలక సన్నివేశాల్లో విష్ణు అన్ని రకాల ఆడియెన్స్ మెప్పించడం ఖాయం. అయితే కథలో వైవిధ్యం లేకపోవడంతో చిన్నా పాత్ర రొటిన్ గా అనిపించవచ్చు. అయితే స్టార్ గా మంచు విష్ణులో కొంత పరిణతి సాధించాడు అని చెప్పవచ్చు. అలేఖ్య పాత్ర నటించిన లావణ్య త్రిపాఠి తనకు మించిన పాత్రనే పోషించదని చెప్పవచ్చు. అయితే అలేఖ్య పాత్ర ద్వారా భావోద్వేగాలను పండించడంలో తడబాటుకు గురైంది. కథ మొత్తం అలేఖ్య పాత్ర చుట్టు తిరగడంతో ఆ పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మంచు విష్ణు ముందు లావణ్య ఉత్తమ నటనను ప్రదర్శించడంలో తేలిపోయింది. పెద్దగా అనుభవం లేని లావణ్య అలేఖ్య పాత్రకు సరిపోలేదనే భావన కలగడం సహజం. ఇక వినోదంలో వీరబ్రహ్మం పాత్ర ద్వారా బ్రహ్మనందం, పిచ్చేశ్వరరావుగా వెన్నెల కిషోర్ కీలకమైన బాధ్యతను నిర్వహించారు. చిత్ర ద్వితీయార్ధంలో ప్రేక్షకులకు వినోదం పండించడంలో మంచు విష్ణు, భరత్ లు కామెడీని పండించారు. ఢిల్లేశ్వర్ గా ప్రకాశ్ త్రిపాఠి, కోటా శ్రీనివాసరావు, అహుతి ప్రసాద్, రావు రమేష్, నాగినీడు, పోసాని కృష్ణ మురళి, హేమ తదితరులు తమ పాత్రల మేరకు పర్వాలేదనించారు.మణిశర్మ రీరికార్డింగ్, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అతిధిగా ప్రత్యేక పాత్రలో మంచు లక్ష్మి మెరిసింది. కథలో కొత్తదనం లేకపోగా, దర్శకుడి కథనం కూడా ప్రేక్షకుడిని కట్టిపడేసేలా లేకపోయింది.దర్శకుడు వీరు పోట్ల పూర్తి స్తాయిలో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించలేకపోయారనే చెప్పవచ్చు. పక్కా మాస్ ఎలిమెంట్స్ తో రూపొందిన 'దూసుకెళ్తా' చిత్రం క్లాస్, మాస్ ఆడియెన్స్ కు చేరువైతే విష్ణు ఖాతాలో మరో హిట్ చేరినట్టే. -
సినీ దర్శకుడు వీరు పోట్లపై కేసు నమోదు!
మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై టాలీవుడ్ సినీ దర్శకుడు వీరు పోట్లపై శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మైక్ టెస్టింగ్ 123 సినిమా హక్కుల్ని ఇస్తానని వీరు మోసం చేసినట్లు జానీ ఫిర్యాదులో తెలిపారు. నిర్మాత జానీ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.