వీరు పోట్ల దర్శకత్వంలో...
Published Sun, Oct 27 2013 12:03 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM
మొన్నటివరకూ మెరుపువేగంతో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన రవితేజ ఇప్పుడు అచితూచి అడుగేస్తున్నారు. చాలాకాలం తర్వాత ‘బలుపు’తో విజయాన్ని అందుకున్న ఆయన... తర్వాత నటించే సినిమా విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ‘బలుపు’ రచయిత బాబీతో రవితేజ ఓ సినిమా చేయనున్నారని గతంలో వార్తలొచ్చాయి.
అయితే... ఆ సినిమాతో పాటు మరో సినిమా కూడా రవితేజ కమిట్ అయ్యారట. బిందాస్, రగడ, దూసుకెళ్తా చిత్రాలతో దర్శకునిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వీరు పోట్ల కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ చిత్రాన్ని ‘ఏ’ టీవీ సమర్పణలో అనిల్ సుంకర నిర్మించనున్నారట. రవితేజ శారీరకభాషకు తగ్గట్టుగా ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌ని వీరు పోట్ల సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుందని తెలిసింది
Advertisement
Advertisement