
నిషేధిత విక్రయాలపై నిఘా
ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
భెంసా: నిషేధిత విక్రయాలపై పకడ్బందీగా నిఘా సారిద్దామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్. వారియర్ అన్నారు. శనివారం భైంసా డీఎస్పీ కార్యాలయంలో పట్టణవాసులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేదిత గుట్కా లు, అక్రమమధ్యం, మట్కా, జూదంలాంటి సమాచారం తెలిస్తే నేరుగా తనకు అందించవచ్చన్నారు. ప్ర భుత్వం నిషేదించిన వాటిని విక్రయించరాదని సూ చించారు. పట్టణ అభివృద్ధిపై పూర్తిస్థాయిలో దృష్టి సారిద్దామని ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిస్థాయిలో దృష్టిసారిస్తామని, ఇం దుకు ప్రజలు పూర్తిగా సహకరించాలన్నారు. నిర్మల్ జిల్లాలో ఏ ఒక్కరూ ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ పన్ను లు చెల్లించకుండా దొడ్డిదారిన అక్రమంగా వెళ్లే వాహనాలపై ప్రజలు నిఘా ఉంచాలని, అట్టిసమాచారాన్ని ఎప్పటికప్పుడు పోలీసులకు తెలి యజేయాలని కోరారు.
ప్రతీ ఒక్కరు మొక్కలు సంరక్షించాలి
నిర్మల్ అర్బన్: ప్రతీ ఒక్కరు మొక్కలను సంరక్షించాలని ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని సా యుధ దళ కార్యాలయంలో శుక్రవారం ఆయన యూ నిట్ జెండాను ఎగురవేశారు. అనంతరం కార్యాల యూన్ని సందర్శించారు. పోలీసులకు విశ్రాంతి కోసం బ్యారక్‌ను మంజూరు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యాలయంలో జనరేటర్, ఇన్వర్టర్‌ను ఏర్పా టు చేశారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క లు నాటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఆర్‌ఐ సాయినాథ్, ఎంటీవో కృష్ణ, ఆర్‌ఎస్సైలు వినోద్, శ్రీకాంత్ , పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.