
ముచ్చటగా మూడోసారి
సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లను సెంటిమెంట్‌గా భావిస్తారు. హీరో, హీరోయిన్.. హీరో, దర్శకుడు... ఇలా అన్నమాట. ఇప్పుడు హీరో మంచు విష్ణు, హీరోయిన్ హన్సికలదీ అటువంటి కాంబినేషనే అని చెప్పాలి. ‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రాలతో వీళ్లిద్దరూ హిట్ జోడీ అనిపించుకున్నారు.
ఇప్పుడు ముచ్చటగా మూడోసారి జోడీ కట్టారు. ‘గీతాంజలి’, ‘త్రిపుర’ వంటి హార్రర్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాజాకిరణ్‌తో విష్ణు ‘లక్కున్నోడు’ పేరుతో ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా హన్సికను ఎంపిక చేసినట్లు నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: పీజీ విందా, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, అచ్చు, సహ నిర్మాతలు: వీఎస్‌ఎన్ కుమార్, విజయ్‌కుమార్‌రెడ్డి.