వాలీబాల్‌ జిల్లా జట్ల ఎంపిక | Volley ball district teams selections | Sakshi
Sakshi News home page

వాలీబాల్‌ జిల్లా జట్ల ఎంపిక

Published Sun, Oct 23 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

వాలీబాల్‌ జిల్లా జట్ల ఎంపిక

వాలీబాల్‌ జిల్లా జట్ల ఎంపిక

తెనాలి: కడపలో నవంబరు 3–6 తేదీల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌ అంతర జిల్లాల జూనియర్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా బాలబాలికల జట్లను ఆదివారం తెనాలిలో ఎంపిక చేశారు. జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీఎస్సార్‌ అండ్‌ ఎన్‌వీఆర్‌ కాలేజీ క్రీడామైదానంలో ఈ ఎంపికలు చేశారు. ఎంపిక కమిటీ సభ్యులుగా ఎస్‌.నిరంజనరావు, జీకేఎస్‌ విజయ్‌చంద్, కె.రజనీనాయక్, షేక్‌ కరిముల్లా, రవి వ్యవహరించారు. జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.గోపీచంద్‌ పర్యవేక్షించారు. 
 
బాలుర జట్టు: కె.రాజేష్‌ (తెనాలి), ఎస్‌.శేషగిరి, పి.కిరణ్‌కుమార్‌ (నిజాంపట్నం), టి.మణికంఠ (ఈమని), పృథ్వీరామ్‌ (వడ్లమూడి), సీహెచ్‌ రవితేజ (పల్లపట్ల), పి.తిరుపతిరెడ్డి, డి.మల్లేష్‌రెడ్డి, ఎస్‌.పవన్‌కళ్యాణ్, జి.సాయిరామ్‌ (వెదుళ్లపల్లి), డి.ఏడుకొండలు, ఎం.మనోజ్‌కుమార్‌ (మంగళగిరి), పి.వినయ్‌కుమార్‌ (హాఫ్‌పేట),  ఎ.సాయికిరణ్‌ (చిలకలూరిపేట), జి.నవీన్‌ (జముడుపాడు). కోచ్‌: కె.రజనీనాయక్‌ (వెదుళ్లపల్లి).
 
బాలికల జట్టు: ఏవీఎస్‌ పార్వతి, కె.జీవననాగజ్యోతి, బి.మదర్‌థెరిసా (అల్లూరు), బి.బిందుమాధవి (సూరేపల్లి), ఎ.కావ్య, ఆర్‌.అఖిల (అమృతలూరు), సీహెచ్‌ హేమప్రియాంక, టి.లక్ష్మి (తాడేపల్లి), వి.విజయలక్ష్మి (అడవులదీవి), ఎం.సింధు (పిరాట్లంక), ఎన్‌.నవ్య (రేపల్లె), కె.ఉమామహేశ్వరి, ఎం.ప్రసన్న (ఖాజీపాలెం), టి.శృతి (పిట్టలవానిపాలెం). కోచ్‌: షేక్‌ కరీముల్లా (అమృతలూరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement