ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ జట్టు మూడో విజయం నమోదు చేసింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బ్లాక్ హాక్స్ 3–2 (15–8, 13–15, 15–9, 15–12, 8–15) సెట్‌ల తేడాతో కోల్‌కతా థండర్‌బోల్ట్స్‌ను ఓడించింది. బ్లాక్ హాక్స్ ఆటగాడు ఎస్‌వీ గురుప్రసాద్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. తాజా గెలుపుతో బ్లాక్ హాక్స్ 6 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment