వాలీబాల్ జట్లకు ముగిసిన శిక్షణ
వాలీబాల్ జట్లకు ముగిసిన శిక్షణ
Published Thu, Oct 6 2016 6:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
తెనాలి: నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం నుంచి జరగనున్న సీనియర్ పురుషులు, మహిళల వాలీబాల్ అంతర జిల్లాల పోటీల్లో పాల్గొనే గుంటూరు జిల్లా జట్లకు శిక్షణ శిబిరం వీఎస్‌ఆర్ అండ్ ఎన్‌వీఆర్ కాలేజీలో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.గోపీచంద్ క్రీడాకారులకు క్రీడాదుస్తులు అందజేశారు. ఘనవిజయం సాధించి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. రాష్ట్ర జట్టులో జిల్లా నుంచి తగిన ప్రాతినిధ్యం ఉండేలా ప్రతిభను చాటాలని కోరారు. కాలేజి వ్యాయామ అధ్యాపకుడు ఎస్.నిరంజన్‌రావు, జిల్లా క్రీడాభివృద్ధి రిటైర్డు అధికారి రావి సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement