సాక్షి, చిత్తూరు: రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడిన రోజా క్రీడాకారుల్లో నూతనోత్సాహాన్ని నింపారు. కాగా, నవంబర్ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 16 వరకు ఈ క్రీడా పోటీలు కొనసాగనున్నాయి. వడమాలపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్పోర్ట్స్ మీట్‌కి సంబంధించి కమిటీ సభ్యులు, వాలీబాల్, స్పోర్ట్స్ ఇన్‌చార్జిలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు క్రీడా ఉత్సవాలలో పాల్గొన్నారు.
చదవండి: (భర్తతో కలిసి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా.. వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment