
నగరి: ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా వెన్నుచూపకుండా మొక్కవోని ధైర్యంతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల సామ్రాట్ సీఎం జగన్ అని కొనియాడారు ఆర్‌కే రోజా. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన మంత్రి రోజా..‘ సచివాలయ వ్యవస్థతో గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ అందించారు.
జగన్ అంటే ఒక బ్రాండ్. కార్యకర్తలే వైఎస్సార్‌సీపీ బలం, బలగం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ఏనాడు అమలు చేయలేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది చంద్రబాబు కాదా?’అని ప్రశ్నించారు. గతంలో పింఛన్ రావాలంటే జన్మభూమి కమిటీల కాళ్లు మొక్కాలి.సీఎం జగన్ గ్రామ, వార్డు వాలంటీర్లతో వ్యవస్థనే మార్చేశారు’ అని అన్నారు మంత్రి రోజా.
Comments
Please login to add a commentAdd a comment