నేడు, రేపు దేహదారుఢ్య పరీక్షలకు విరామం | today, tommorrow break for polish selections | Sakshi
Sakshi News home page

నేడు, రేపు దేహదారుఢ్య పరీక్షలకు విరామం

Published Sun, Jul 31 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

హైజంప్‌ చేస్తున్న అభ్యర్థి

హైజంప్‌ చేస్తున్న అభ్యర్థి

ఖమ్మంక్రైం: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు వివిధ విభాగాల్లో  నిర్వహిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్స్‌ శారీరక దారుఢ్య పరీక్షలకు ఆదివారం, సోమవారం విరామం ఇవ్వనున్నట్లు ఎస్పీ షానవాజ్‌ ఖాసీం తెలిపారు. ఆగస్టు 2 నుంచి పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1200 మందికి గాను  950 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పురుష అభ్యర్థులకు 800 మీటర్ల పరుగును నిర్వహించి అందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు, ఛాతి ఎత్తు కొలతలను పరిశీలించారు. ఈ అభ్యర్థులకు ఆగస్టు 2న ఈవెంట్లను నిర్వహిస్తారు. అలాగే మహిళా అభ్యర్థులకు బయోమెట్రì క్, అభ్యర్థుల ఆధార్‌ కార్డు, సర్టిఫికెట్లను వెరిఫికేషన్‌ చేశారు. ఎత్తులో అర్హత సాధించిన వారికి 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్‌ నిర్వహించారు. తప్పిదాలు, అవకతవకలు జరగకుండా అదనపు ఎస్పీ సాయికృష్ణ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ, ఐటీ కోర్‌ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ రాంరెడ్డి, నరేందర్‌రావు, వీరేశ్వరరావు, సాయిశ్రీ, సురేష్‌కుమార్, ఏఆర్‌ డీఎస్పీలు సంజీవ్, మాణిక్‌రాజ్, ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలు, వైద్యులు పాల్గొన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement