జిల్లా సీనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
జిల్లా సీనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
Published Sun, Sep 4 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
విజయవాడ స్పోర్ట్స్ : సామర్లకోట(తూర్పుగోదావరి)లో అక్టోబరు 6 నుంచి 9వ తేదీ వరకూ జరిగే ఏపీ స్టేట్ సీనియర్ కబడ్డీ మీట్‌లో పాల్గొనే జిల్లా జట్లను ఆదివారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఎంపిక చేశారు. ఎంపికైన జట్లకు ఈనెల 10 నుంచి కోచింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తెలిపారు.
పురుషుల జట్టు : టి.బసవయ్య (కెప్టెన్, ఎక్సైజ్ కానిస్టేబుల్), ఎన్.నాగార్జున (ఇన్‌కం ట్యాక్స్), ఎంసీహెచ్ వెంకటేశ్వరరావు (ఈఎస్‌ఐ), సీహెచ్ మనోజ్‌కుమార్ (సీఆర్పీఎఫ్), జె.అంకాలు (ఉయ్యూరు, ఏజీఎస్‌జీఎస్), కె.బాలాజీ (తాడిగడప), ఎంవీ నరేంద్ర (ఏజీఎస్‌జీఎస్), ఎం.చినబాబు (సెయింట్ జాన్స్ హైస్కూల్, విజయవాడ), జి.రఘురామ్, జి.నరేష్ (బుడవాడ), పి.సుధాకర్‌రావు (పెనుగంచిప్రోలు), డి.హనుమంతరావు (ఏఎన్‌యూ క్యాంపస్), వి.ప్రభుకరుణ (నాగాయలంక), ఎస్.మోహనకృష్ణ (విజయవాడ), కె.రవిబాబు (ఏపీ పోలీస్, విజయవాడ), బి.సుధీర్ (ఉప్పులూరు) ఎంపికయ్యారు. కోచ్‌గా కె.బాలస్వామి (ఉయ్యూరు జెడ్పీ స్కూల్ పీఈటీ), మేనేజర్‌గా వి.వెంకటేశ్వరరావు (పీఈటీ జెడ్పీస్కూల్, మొవ్వ) వ్యవహరిస్తారు.
మహిళా జట్టు : ఎండీ నసీమా సుల్తానా (కెప్టెన్, గన్నవరం), ఎం.నవ్య, ఎన్.తిరుపతమ్మ (నాగాయలంక), ఎం.మరియమౌనిక (ఎస్‌సీ రైల్వే సికింద్రాబాద్), కేఎల్‌వీ రమణ (కోడూరు), పి.దేవి, బి.ఎస్తేర్‌రాణి, వి.యశస్విని (ఉయ్యూరు, ఏజీఎస్‌జీఎస్), డి.సునీత (కేవీఆర్ కళాశాల, నందిగామ), వి.రమణ (పీవీపీ సిద్ధార్థ కళాశాల, కానూరు), కె.కోటేశ్వరమ్మ (ఎస్‌వీఎల్ క్రాంతి కళాశాల, అవనిగడ్డ), డి.వెంకటలక్ష్మి (ఏజీఎస్‌జీఎస్), వి.ప్రీతి (కపిలేశ్వరపురం), బి.దుర్గాభవాని (తాడంకి), జి.శిరీష (ఇబ్రహీంపట్నం), కె.భార్గవి (తాడంకి, జెడ్పీ హైస్కూల్), ఎ.చిన్మయి శ్రీజా (కానూరు), కె.ప్రత్యూష (నందిగామ) ఎంపికయ్యారు. కోచ్‌గా జి.రమేష్ (తాడంకి జెడ్పీ హైస్కూల్ పీఈటీ), ఎ.సీతాకుమారి (ఏపీఎస్‌ఆర్‌జేసీ నందిగామ పీడీ) వ్యవహరిస్తారు.
Advertisement
Advertisement