జిల్లా స్థాయి సీనియర్ కొరిగి తైక్వాండో సెలక్షన్స్ పోటీలు ఈ నెల 19 న నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అధ్యక్ష, కార్యదర్శులు గురుస్వామి, గోపాల్‌రెడ్డి లు ఓ ప్రకటన లో తెలిపారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా స్థాయి సీనియర్ కొరిగి తైక్వాండో సెలక్షన్స్ పోటీలు ఈ నెల 19 న నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అధ్యక్ష, కార్యదర్శులు గురుస్వామి, గోపాల్‌రెడ్డి లు ఓ ప్రకటన లో తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ స్థానిక ఇండోర్ స్టేడియం లో నిర్వహిస్తున్నామన్నారు. 31 డిసెంబర్ 1998 కి ముందు జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు.
ఆసక్తి కలిగిన వారు జనన ధృవీకరణ పత్రం(ఈ–సేవ), ఆధార్‌కార్డ్, బ్లాక్‌బెల్ట్ సర్టిఫికెట్ తో హాజరుకావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులను అక్టోబర్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగే అంతర్ జిల్లాల పోటీలకు పంపుతామన్నారు.