taiquando
-
తైక్వాండో పోటీలు ప్రారంభం
అనంతపురం న్యూసిటీ : స్థానిక ఇండోర్ స్టేడియంలో తైక్వాండో జిల్లా స్థాయి పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు క్యాడెట్ విభాగంలో పోటీలు జరిగాయి. క్యాడెట్లో సీ.వనిత, పీ.హర్షిత, వీ.మైత్రేయి, పీ. రిచిత, ఎం.నాగసాయిహాసిని, సీ. శ్రీ వైష్ణవి, డీ ప్రశస్థ బంగారు పతకాలు సాధించారు. కఠోర సాధనతోనే గుర్తింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి క్రీడాకారులకు పలు సూచనలు సలహాలను అందించారు. క్రీడాకారులకు కఠోర సాధనతోనే గుర్తింపు వస్తుందన్నారు. దేశం గర్వించదగ్గ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తైక్వాండో క్రీడకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. మున్ముందు మరిన్ని పోటీలకు ‘అనంత’ వేదికగా నిలుస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్సీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రియేటర్ కృష్ణ, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు కొర్రపాడు హుస్సేన్‌పీరా, తైక్వాండో సంఘం ప్రధాన కార్యదర్శి గురుస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
తైక్వాండో సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్ : స్థానిక ప్రభుత్వ ఆర్‌్ట్స కళాశాల మహిళా సాధికారిక విభాగం ఆ« ద్వర్యంలో గురువారం విద్యార్థినులకు తై క్వాండో సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎ¯న్.రంగస్వామి మాట్లాడుతూ మారుతున్న సా మాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థినులు ఇలాంటి ఆత్మరక్షణకు శిక్షణ తీసుకోవడం చాలా ఉపయోగకరమన్నారు. తైక్వాం డో జిల్లా కార్యదర్శి శాంతారాజ్, మహిళా సా ధికారిక విభాగాధిపతి బి. జమీలాబీబీ, ఐ క్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ వై.పురుషోత్తమరెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వై.రవిచంద్ర, ఎస్కేయూ పాలకమండలి సభ్యురాలు బి.నాగజ్యోతిర్మయి, విద్యార్థినులు పాల్గొన్నారు. -
తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక స్థానిక ఇండోర్ స్టేడియంలో గురువారం ఉదయం నిర్వహించినట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా క్రీడాభివద్ధి అధికారి బాషామోహిద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సబ్–జూనియర్(అండర్–11) జిల్లా జట్ల ఎంపికకు జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 11 నుంచి 13 వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్డీఓ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. జిల్లా జట్టుకు మేనేజర్‌గా ఉమామహేశ్, కోచ్‌గా రామాంజినేయులును నియమించారు. ఎంపికైన జిల్లా బాలుర జట్టు గౌతంకష్ణారెడ్డి–18 కిలోల లోపు రాజీవ్లోచన్–21 ’’ జునేద్ అహమ్మద్–23 ’’ పవన్శివరామ్–25 ’’ పవన్‌శ్రీరాం–27 ’’ స్వప్నిల్రాజ్–29 ’’ విష్ణుతేజ–32 ’’ రిషీ చౌహాన్–32 కేజీల పైబడి బాలికల జట్టు నిహారిక–16 కేజీల లోపు నీతుశ్రీసాయి–18 ’’ జోహ్న–24 ’’ వెన్నెల–26 ’’ నిఖిత షోరెల–29 ’’ -
జిల్లా తైక్వాండో సబ్–జూనియర్ జట్ల ఎంపిక
అనంతసురం సప్తగిరి సర్కిల్ : ఈనెల 27న జిల్లా తైక్వాండో సబ్–జూనియర్ జట్ల ఎంపిక నిర్వహించనున్నట్లు జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గురుస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపిక స్థానిక ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జరుగుతుందన్నారు. అండర్–11 కు చెందిన బాల, బాలికలు ఎంపికకు హాజరుకావాలని కోరారు. ఇందులో మొదటి స్ధానాల్లో నిలిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నవంబర్ 11 నుంచి 13 వరకు కాకినాడలో జరుగుతాయన్నారు. ఇతర వివరాలకు 7982440946 నంబరుకు సంప్రదించాలన్నారు. -
19న సీనియర్ తైక్వాండో సెలక్షన్స్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా స్థాయి సీనియర్ కొరిగి తైక్వాండో సెలక్షన్స్ పోటీలు ఈ నెల 19 న నిర్వహిస్తున్నట్లు జిల్లా తైక్వాండో అధ్యక్ష, కార్యదర్శులు గురుస్వామి, గోపాల్‌రెడ్డి లు ఓ ప్రకటన లో తెలిపారు. ఈ ఎంపిక ప్రక్రియ స్థానిక ఇండోర్ స్టేడియం లో నిర్వహిస్తున్నామన్నారు. 31 డిసెంబర్ 1998 కి ముందు జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు జనన ధృవీకరణ పత్రం(ఈ–సేవ), ఆధార్‌కార్డ్, బ్లాక్‌బెల్ట్ సర్టిఫికెట్ తో హాజరుకావాలన్నారు. ఎంపికైన క్రీడాకారులను అక్టోబర్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగే అంతర్ జిల్లాల పోటీలకు పంపుతామన్నారు. -
తైక్వాండో విజేతలకు అభినందనలు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : విజయనగరంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి 3వ క్యాడెట్ అండర్–14 (36వ జూనియర్), అండర్–17 విభాగాలలో తైక్వాండో పోటీల్లో నాలుగు బంగారు, రెండు రజతం, ఐదు కాంస్య పతకాలు సాధించి అనంతపురం జట్టు రెండో స్థానంలో నిలిచిందని జిల్లా తైక్వాండో అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. గురువారం ఆర్డీటీ కార్యాలయంలో ఆర్డీటీ ప్రెసిడెంట్ అన్నే ఫెర్రర్, ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంఛో ఫెర్రర్‌ను కలిశారు. పతకాలు సాధించిన క్రీడాకారులను వారు అభినందించారు. జిల్లాలో తైక్వాండో క్రీడ అభివద్ధికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. బంగారు పతకాలు సాధించినవారిలో బాలురు జయేష్, దత్తుసాయి, బాలికలు రోజా, సాయిదీప్తి ఉన్నారు. హేమ, ఆశాదీక్షిత రజకపతకాలుసాధించారు. కాంస్య పతకాలు సాధించినవారిలో బాలురు శివకష్ణ, నదీమ్‌ఖాన్, బాలికలు ప్రశాంతి, యశశ్విణి, హేమశశి ఉన్నారు.