తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక | taiquando district teams elect | Sakshi
Sakshi News home page

తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక

Published Thu, Oct 27 2016 10:48 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక - Sakshi

తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : జిల్లా తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక స్థానిక ఇండోర్‌ స్టేడియంలో గురువారం ఉదయం నిర్వహించినట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా క్రీడాభివద్ధి అధికారి బాషామోహిద్దీన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సబ్‌–జూనియర్‌(అండర్‌–11) జిల్లా జట్ల ఎంపికకు జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్‌ 11 నుంచి 13 వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్‌డీఓ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. జిల్లా జట్టుకు మేనేజర్‌గా ఉమామహేశ్, కోచ్‌గా రామాంజినేయులును నియమించారు.

ఎంపికైన జిల్లా బాలుర జట్టు
గౌతంకష్ణారెడ్డి–18 కిలోల లోపు
రాజీవ్‌లోచన్‌–21   ’’
జునేద్‌ అహమ్మద్‌–23 ’’
పవన్‌శివరామ్‌–25 ’’
పవన్‌శ్రీరాం–27 ’’
స్వప్నిల్‌రాజ్‌–29 ’’
విష్ణుతేజ–32 ’’
రిషీ చౌహాన్‌–32 కేజీల పైబడి

బాలికల జట్టు
నిహారిక–16 కేజీల లోపు
నీతుశ్రీసాయి–18 ’’
జోహ్న–24 ’’
వెన్నెల–26 ’’
నిఖిత షోరెల–29 ’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement