district teams elect
-
తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా తైక్వాండో జిల్లా జట్ల ఎంపిక స్థానిక ఇండోర్ స్టేడియంలో గురువారం ఉదయం నిర్వహించినట్లు జిల్లా తైక్వాండో సంఘం అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. కార్యక్రమానికి జిల్లా క్రీడాభివద్ధి అధికారి బాషామోహిద్దీన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సబ్–జూనియర్(అండర్–11) జిల్లా జట్ల ఎంపికకు జిల్లాలోని క్రీడాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 11 నుంచి 13 వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. డీఎస్డీఓ మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించి జిల్లా పేరును నిలబెట్టాలన్నారు. జిల్లా జట్టుకు మేనేజర్‌గా ఉమామహేశ్, కోచ్‌గా రామాంజినేయులును నియమించారు. ఎంపికైన జిల్లా బాలుర జట్టు గౌతంకష్ణారెడ్డి–18 కిలోల లోపు రాజీవ్లోచన్–21 ’’ జునేద్ అహమ్మద్–23 ’’ పవన్శివరామ్–25 ’’ పవన్‌శ్రీరాం–27 ’’ స్వప్నిల్రాజ్–29 ’’ విష్ణుతేజ–32 ’’ రిషీ చౌహాన్–32 కేజీల పైబడి బాలికల జట్టు నిహారిక–16 కేజీల లోపు నీతుశ్రీసాయి–18 ’’ జోహ్న–24 ’’ వెన్నెల–26 ’’ నిఖిత షోరెల–29 ’’ -
జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా టేబుల్ టెన్నిస్ జట్ల ఎంపిక బుధవారం నిర్వహించినట్లు జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్బర్‌సాహెబ్, జాయింట్ సెక్రెటరీ ధనుంజయరెడ్డిలు తెలిపారు. జట్ల ఎంపిక స్థానిక అనంతపురం క్లబ్ నందు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా బాల, బాలికల, జూనియర్ బాలుర విభాగంలో ఎంపిక చేశామన్నారు. ఎంపికైన జట్లు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నవంబర్ 3 నుంచి 6 వరకు జరిగే రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. బాలుర జట్టు వంశీకష్ణ, కుషల్‌కుమార్, ధార్మిక్, బాలసుబ్రహ్మణ్యం, కష్ణ బాలికల జట్టు హిమప్రియ, అమూల్య, హాసిని, భవ్యప్రియ, సులస్య జూనియర్ బాలుర జట్టు కుషల్‌కుమార్, ధార్మిక్, సాజిద్, కష్ణ, బాలసుబ్రహ్మణ్యం. -
19న టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ నెల 19న టేబుల్ టెన్నిస్ జిల్లా జట్ల ఎంపికను నిర్వహిస్తున్నట్లు జిల్లా టీటీ అధ్యక్షుడు అక్బర్‌సాబ్, కార్యదర్శి కేశవరెడ్డి, కోచ్ ధనుంజయరెడ్డిలు ఓ ప్రకటనలో తెలిపారు. బాలబాలికలు, జూనియర్ బాలబాలికల టీమ్‌లను ఎంపిక చేస్తామన్నారు. అనంతపురం క్లబ్లో ఉదయం 9 గంటలకు ఎంపిక ఉంటుందని చెప్పారు. ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 3 నుంచి 6 వరకు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగే రాష్ట్రస్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9492400192 నెంబరును సంప్రదించాలన్నారు.